Samsung Galaxy Tab A9: శామ్‌సంగ్ నుంచి సరికొత్త ట్యాబ్! ధర, ప్రత్యేకతలు ఇవే..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy Tab A9: శామ్‌సంగ్ నుంచి సరికొత్త ట్యాబ్! ధర, ప్రత్యేకతలు ఇవే..

    Samsung Galaxy Tab A9: శామ్‌సంగ్ నుంచి సరికొత్త ట్యాబ్! ధర, ప్రత్యేకతలు ఇవే..

    October 10, 2023

    ప్రముఖ స్మార్ట్ ఫొన్ కంపెనీ శామ్‌సంగ్ నుంచి త్వరలో మరో కొత్త గ్యాడ్జెట్ రిలీజ్ కానుంది. Samsung Galaxy Tab A9, Tab A9+ త్వరలో ఇండియాలో రిలీజ్ కానున్నట్లు పలు టెక్ వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీటి ధర, స్పెసిఫికేషన్స్, ఇతర ప్రత్యేకతల గురించి పలు కథనాలు ప్రచురిస్తున్నాయి. 

    Galaxy Tab A9 తొలుత FCC, సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్స్‌లో కనిపించింది, అనంతరం Galaxy Tab A9+ బ్లూటూత్ SIG, ఇండియన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) TDRA వంటి ప్రఖ్యాత సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లలో కనిపించింది. దీంతో దీని లాంచింగ్ త్వరలో ఉండబోతుందనే ఊహగానాలకు మరింత బలం చేకూర్చింది.

    భారత్‌లో Galaxy Tab A9+  లాంచ్‌ను నిర్ధారించే అత్యంత ముఖ్యమైన పరిణామం భారతీయ BIS ధృవీకరణ వెబ్‌సైట్‌లో దీని జాబితా కనిపించడం. ముఖ్యంగా, Galaxy Tab A9, మోడల్ నంబర్ SM-X115తో గుర్తించబడింది.

     అయితే ప్రస్తుతానికి, ఈ ట్యాబ్ లాంచ్ తేదీలకు సంబంధించి శామ్‌సంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏది ఏమైనప్పటికీ, Galaxy Tab, Galaxy Tab A9+ రెండూ ఇండియా టాబ్లెట్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్దమయ్యాయని తెలుస్తోంది. మరి దీని ప్రత్యేకతలు, ధర ఓసారి పరిశీలిద్దాం.

    ప్రత్యేకతలు

    శామ్‌సంగ్ గెలాక్సి ట్యాబ్ A9 5జీ కనెక్టివిటీతో వస్తుందని అంచనా.  ఇది హై డెటా ట్రాన్సఫర్ స్పీడ్ కలిగి ఉండనుందని టాక్. దీంతోపాటు వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్‌ఎమ్ రెడియా వంటి ఫీచర్స్‌ను కలిగి ఉండనుంది. ఇక దీని బ్యాటరీ సామర్థ్యానికి వస్తే 5100mAH హోల్డ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ట్యాబ్ A9-+ లెటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.1 కలిగి ఉండి డెటా ఫాస్ట్ సర్వీస్ ఉండును.

    ఇక Samsung Galaxy Tab A9 ధర రూ.22,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు. Samsung Galaxy Tab A9+ ధర రూ.30,000 వరకు ఉండే ఛాన్స్ ఉంది.

    ఇతర స్పెసిఫికేషన్స్

    Display: 8.7-inch

    Battery: 5,100mAh

    Bluetooth: 5.0

    Wi-Fi: 5

    USB Type-C port

    Android: 13

    Single Rear-Facing Camera

    Versions: Wi-Fi / Wi-Fi + Cellular (LTE)

    3.5mm Headphone Jack

    MicroSD Card Slot

    Samsung ఈ టాబ్లెట్‌ల పలు వెబ్‌సైట్లలో వివరణాత్మక సమాచారం లభిస్తున్నప్పటికీ ట్యాబ్ లవర్స్ శామ్‌సంగ్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. టెక్ వెబ్‌సైట్లు, ఛానెళ్లు Galaxy Tab A9, Galaxy Tab A9 వివరాలు, ఫీచర్‌లు, పనితీరు, వినూత్నమైన అంశాలపై ఇచ్చే ప్రివ్యూ కోసం టెక్ ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version