టాలీవుడ్ దిగ్గజ నటుల్లో విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh) ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం‘ (Sankranthiki Vasthunnam) విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్‌కు జోడీగా యంగ్ హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రమోషన్‌కు నటుడు వెంకటేష్ శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
3000 మందితో ఫొటోలు..
‘సంక్రాంతికి వస్తున్నాం‘ (Sankranthiki Vasthunnam) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు వెంకటేష్ క్రేజీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏకంగా 3000 మందికి పైగా అభిమానులతో ఏకధాటిగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెంకీతో ఫొటో కోసం పెద్ద ఎత్తున ఫ్యాన్స్ బారులు తీరడం ఈ వీడియోలో గమనించవచ్చు. క్యూలో నిలబడిన అభిమానులు తమ వంతు రాగానే ఒక్కొక్కరిగా వెంకటేష్‌తో ఫొటో దిగారు. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
వెంకీ నిజంగా గ్రేట్..
సాధారణంగా సెలబ్రిటీలు ఒకరిద్దరితో ఫొటోలు దిగాలంటేనే నీరసించిపోతారు. అటువంటిది వెంకటేష్ ఏకంగా 3000+ మందితో ఒకేసారి ఫొటోలు దిగడమంటే సాధారణ విషయం కాదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘వెంకీ మామా నిజంగా గ్రేట్’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఏమాత్రం విసుగులేకుండా ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగడాన్ని మెచ్చుకుంటున్నారు. ఫ్యాన్స్‌తో ఎలా వ్యవహరించాలో చూపిస్తూ ప్రస్తుత తరం హీరోలకు వెంకటేష్ ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
మూడు పాటలు ట్రెండింగ్
‘సంక్రాంతికి వస్తున్నాం‘ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మూడు సాంగ్స్ విడుదలవ్వగా అన్ని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ‘గోదారి గట్టు’, ‘మీను’, ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టు’ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాగే వెంకటేష్ స్వయంగా స్వరం అందించిన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ ఆకట్టుకుంటోంది.
మాజీ పోలీసు అధికారిగా..
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయనకు భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి నటించారు. వీరితోపాటు సినిమాలో ఉపేంద్ర, సాయి కుమార్, నరేష్, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్ మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి ఇతర పాత్రలు చేశారు. ఈ చిత్రం కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తుందని మూవీ టీమ్ ధీమాగా ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!