Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్

  Saripodhaa Sanivaaram First Single: నాని ఊరమాస్ ఊచకోత… ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ సింగిల్

  June 15, 2024

  నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రోజు రోజుకు బజ్ పెరిగిపోతోంది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు హిట్ కావడంతో నాని హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. ఈసారి పక్క మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్నట్లు మూవీ పోస్టర్స్, గ్లింప్స్‌ను బట్టి అర్ధమవుతోంది. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న సరిపోదా శనివారంలో నాని మాస్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. నానికి వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో ఇది రెండో సినిమా. గతంలో అంటే సుందరానికీ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించి విజయం సాధించారు. మళ్లీ ఈ హిట్ కాంబో సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్

  సరిపోదా శనివారం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘గరం గరం’ పేరుతో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా సాంగ్ ఉంది. ఆకట్టుకునే మాస్ లిరిక్స్‌ను సాహపాఠి భరద్వాజ్ పుత్రుడు అందించాడు. ఈ లిరిక్స్ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను రివీల్ చేసే విధంగా ఉంది.   జేక్స్ బిజోయ్ మాస్ ట్యూనింగ్‌లో విశాల్ దద్వాని వాయిస్‌ సాంగ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఊర మాస్ బీట్‌తో ప్రేక్షకులను అయితే అలరిస్తోందని చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్‌ను నాని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. మరో సాలిడ్ హిట్ పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

  రూ. 100 కోట్లు పక్కా?

  నాని నటించిన దసరా చిత్రం రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ .. కలెక్షన్ల పరంగా నిరాశ పరిచిందని చెప్పవచ్చు. దీంతో పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథాంశాన్ని నాని ఎంచుకున్నాడు. ఈ సినిమాపై ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా కూడా దసరా చిత్రం మాదిరి రూ.100కోట్లకు పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ చర్చించుకుంటోంది.

  నటీనటలు వీళ్లే!

  ఇక నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గంతలో వీరి కాంబోలో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి ఫుల్ టైం మాస్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అటు నానికి అపోజిట్ క్యారెక్టర్‌లో తమిళ్ స్టార్ డైరెక్టర్, నటుడు ఎస్‌ జే సూర్య నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందనే బజ్ ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో పెరిగిపోయింది. ప్రియాంక మోహన్‌తో పాటు అదితి బాలన్ , సాయికుమార్, శుభలేక సుధాకర్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు.

  షూటింగ్ ఫినిష్

  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్లో నాని మాస్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి మురళి జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా కార్తిక శ్రీనివాస్ పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్  వారు  పాన్ ఇండియా భాషల్లో ఈ ఆగస్ట్ 29న  విడుదల చేయనున్నారు

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version