Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

    Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

    September 2, 2024

    నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం‘ (Saripodhaa Sanivaaram Weekend Collections). గురువారం (ఆగస్టు 29) విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ నాని సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు థియేటర్‌ అక్యుపెన్సీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నాని చిత్రం ఎంత వసూలు చేసింది? తొలి నాలుగు రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్‌ కొల్లగొట్టింది? ఇప్పుడు చూద్దాం. 

    వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే?

    నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.68.52  కోట్లు (GROSS) సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇదిలా ఉంటే ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘సరిపోదా శనివారం’ దేశంలో రూ.33.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇప్పటివరకూ రూ.29.65 వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. అటు కర్ణాటకలో రూ. 4.65 కోట్లు, తమిళనాడులో రూ.3.23 కోట్లు, కేరళలో రూ.27 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.1.45 కోట్లు రాబట్టినట్లు వివరించాయి. 

    రూ.100 కోట్ల మార్క్‌ దిశగా..

    బాక్సాఫీస్‌ వద్ద సరిపోదా శనివారం దూకుడు చూస్తుంటే ఈజీగానే రూ.100 కోట్ల మార్క్ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వాయు గుండం ప్రభావం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్ష ప్రభావం తగ్గితే ‘సరిపోదా శనివారం’ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. తద్వారా అలవోకగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి. నాని కెరీర్‌లో ‘దసరా’ మాత్రమే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో రెండో చిత్రం లోడింగ్‌ అంటూ నాని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. 

    నెలలోపే ఓటీటీలోకి..!

    నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram OTT) నెల రోజుల లోపే ఓటీటీలోకి రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం అవుతుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హిందీ వెర్షన్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలోనూ హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్‌, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. 

    సినిమాలో అవే హైలెట్స్‌

    మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో – విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి.

    ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే..

    సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version