ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు

    ఎస్‌బీఐ ఆఫర్; రూ.7 వేల ఈఎంఐతో కొత్త కారు

    March 22, 2023

    Courtesy Twitter: MotorBeam

    ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తక్కువ ఈఎంఐలతో కారు లోన్లు అందిస్తోంది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఈఎంఐలతో కొత్త కార్లను సొంతం చేసుకోవచ్చు. రూ.7,733 ఈఎంఐతో హ్యూందాయ్ శాంట్రో కారును దక్కించుకోవచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై ఈఎంఐ రూ.8,433 నుంచి ప్రారంభం అవుతుంది. హ్యూందాయ్ ఆరా కారుకు రూ.9,547 చెల్లించవచ్చు. హ్యూందాయ్ క్రెటా కారు ఈఎంఐ రూ.16,342 నుంచి ఉంది. అలాగే హ్యూందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఈఎంఐ రూ.37,855 నుంచి ప్రారంభం అవుతుంది.

    పండుగ సమయంలో క్రెడిట్ కార్డుపైనా అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. హోండా బైక్‌ కొనుగోలుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఒక కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.5 వేల తగ్గింపు వస్తుంది. మార్చి 31 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కనీస ట్రాన్సాక్షన్ విలువ రూ. 40 వేల వరకు ఉండాలి. ఇది ఈఎంఐ లావాదేవీలకు వర్తిస్తుంది. ఒప్పో ప్రొడక్టులు, ఎల్పీజీ ఉత్పత్తులపైనా కూడా కస్టమర్లను ఆకర్షించే విధంగా ఆఫర్లు ప్రకటించింది ఈ బ్యాంకు. 

    sbi

    కస్టమర్ల కోసం ఏడాది ప్రారంభం నుంచి సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. దాదాపు చాలా బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లు పెంచిన తరుణంలో ఎస్బీఐ మాత్రం తగ్గించింది. వడ్డీపై భారీగా రాయితీ ఇస్తోంది. క్యాంపెయిన్ రేట్స్ పేరిట ఆఫర్ ప్రకటించిన ఎస్బీఐ… రుణాలపై 30 నుంచి 40 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటులో రాయితీ ఇస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా హోమ్‌ లోన్ తీసుకోవాలనుకునే వారికి  8.60 శాతం వడ్డీతోనే లోన్లు అందిస్తున్నారు. అంతేకాదు, రెగ్యులర్ టాప్ అప్ లోన్స్‌పైనా ప్రాసెసింగ్ ఫీజును తొలగించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version