సెబాస్టి‌యన్ పీసీ 524 మూవీ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెబాస్టి‌యన్ పీసీ 524 మూవీ రివ్యూ

    సెబాస్టి‌యన్ పీసీ 524 మూవీ రివ్యూ

    July 20, 2022

    రాజావారు రాణిగారు, SR కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మూడో సినిమా సెబాస్టియన్ పీసీ 524. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో కోమలి ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించగా సయ్యపు రెడ్డి దర్శకత్వం వహించారు. కిరణ్ హీరోగా చేసిన రెండు సినిమాలు మంచి హిట్ సాధించడంతో ఈ మూడో సినిమాపై కూడా మొదటి నుంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఆ ఆసక్తికి అనుగుణంగా సెబాస్టియన్ అభిమానుల మనసు దోచుకున్నాడా? అసలు సినిమా కథేంటి?లాంటి విషయాలు ఓసారి చూసేద్దాం.

    రే చీకటి కానిస్టేబుల్

    రే చీకటి సమస్యతో బాధపడే సెబాస్టియన్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఇన్ని రోజులు మేనేజ్ చేసినట్టే ఉద్యోగాన్ని కూడా మేనేజ్ చేయోచ్చని ధీమాగా ఉంటాడు. కాని నైట్ డ్యూటీలు వేయడంతో అనుకోని చిక్కులొచ్చి పడతాయి. ఒకరోజు నీలిమా(కోమలి ప్రసాద్) అనే మహిళ హత్యకు గురవుతుంది.

    అసలు ఆ హత్యకు సెబాస్టియన్‌కి మధ్య సంబంధం ఏంటి? అతడిని ఎందుకు సస్పెండ్ చేశారు..? నీలిమాను ఎవరు హత్య చేశారు? సెబాస్టియన్ లవర్ హేలీ(నువేక్ష)కి ఈ కేసుతో సంబంధం (నువేక్ష) ఏంటి? హీరో ఈ కేసును చేధిస్తాడా? అనే అంశాలను థియేటర్‌లో చూడాల్సిందే.

    పాత్రల ప్రాధాన్యత

     రోటీన్‌కి భిన్నమైన కథ అయినప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ సయ్యపు రెడ్డి కాస్త తడబడినట్లు కనిపిస్తుంది. హీరో కిరణ్ అబ్బవరం తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సినిమాలో తనదైన రీతిలో పంచ్‌లు విసిరి కామెడీ పంచాడు. ఫస్టాఫ్ అంతా కామెడీ, థ్రిల్లింగ్ సన్నివేశాలతో కొనసాగినప్పటికీ.. సెకాండాఫ్ చాలా స్లోగా అనిపించిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాగే సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా అనూహ్యరీతిలో ముగిసినట్లు భావిస్తున్నారు. ఈ మూవీలో హీరో తర్వాత ఎక్కువగా వినోదాన్ని పంచింది శ్రీకాంత్ అయ్యంగారే అని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్లు ఇద్దరూ అభిమానులను ఆకట్టుకోలేకపోయారు.  మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. అలాగే రాజ్ కె.నల్లీ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది.

    బలాలు

    హీరో యాక్టింగ్

    కామెడీ సన్నివేశాలు

    జిబ్రాన్ మ్యూజిక్

    శ్రీకాంత్ అయ్యంగార్ సీన్లు

    బలహీనతలు

    డైరెక్టర్ స్క్రీన్ ప్లే

    అనాసక్తికర సీన్లు

    క్లైమాక్స్‌లో లాజిక్ మిస్ 

       ఓవరాల్‌గా ఈ సినిమాపై భిన్నభిప్రాయాలు వచ్చినప్పటికీ ఒక్కసారి వీక్షించొచ్చని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. అలాగే మూవీలోని పాటలు, కొన్ని కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. మూవీలో లాజిక్ మిస్ అవ్వడంతో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది. ఈ మూవీకి నిర్మాతలుగా బి.సిద్ధారెడ్డి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు వ్యవహరించారు.

    రేటింగ్ 2.5\5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version