Second Hand Books In Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ కోసం వెతుకున్నారా? ఇక్కడ ట్రై చేయండి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Second Hand Books In Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ కోసం వెతుకున్నారా? ఇక్కడ ట్రై చేయండి

    Second Hand Books In Hyderabad: సెకండ్‌ హ్యాండ్‌ బుక్స్‌ కోసం వెతుకున్నారా? ఇక్కడ ట్రై చేయండి

    May 18, 2023

    మనిషి వికాసానికి పుస్తకాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ప్రతీ మనిషి జీవితంలో పుస్తకం అంతర్బాగమనే చెప్పాలి. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ప్రతీ దశలోనూ మానవుడి జీవితం పుస్తకాలతో ముడిపడి ఉంది. పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారవి పెద్దలు చెబుతుంటారు. మనకు ఎంతో జ్ఙానాన్ని ఇచ్చే పుస్తకాలను ప్రస్తుత స్మార్ట్‌ యుగంలోనూ చాలా మంది ఇష్టంగా చదువుతున్నారు. అయితే ఎక్కువ డబ్బులు చెల్లించి పుస్తకాలను కొనుగోలు చేయడం వారికి కష్టంగా మారుతోంది. అయితే హైదరాబాద్‌ వాసులకు ఈ సమస్య లేదనే చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్‌ రూపంలో తక్కువ ధరకే పుస్తకాలు లభిస్తాయి. ఆ ప్రాంతాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    1. కోఠి మార్కెట్‌

    హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతం సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలకు ఎంతో ఫేమస్‌. ఇక్కడ ప్రతీ ఆదివారం పుస్తకాల సంత నడుస్తుంటుంది. రోడ్డుకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లపై పాత పుస్తకాలను పెట్టి అమ్ముతారు. పుస్తక ప్రియులు, అకడమిక్ బుక్స్ కోసం వెతికే వారు కోఠి ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ రూ.800 ధర ఉన్న పుస్తకం కూడా కేవలం రూ.150 కే లభిస్తుంది. నగరంలో మరెక్కడా లభించని పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అదే విధంగా కేజీల లెక్కన నోట్‌బుక్‌లను కూడా ఇక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. కోఠి బుక్‌షాప్స్‌లోనూ సరసమైన ధరలకే నోట్‌బుక్స్‌ లభిస్తాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ క్లాస్‌బుక్స్ రేటు తక్కువనే చెప్పాలి. పెద్ద మెుత్తంలో కొనుగోలు చేసేవారు బేరం ఆడి మరింత తక్కువకే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ కొనుగోలు చేయోచ్చు. 

    2. అబిడ్స్‌ మార్కెట్‌

    అబిడ్స్‌లోనూ సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు తక్కువ ధరకే లభిస్తాయి. ఆదివారం అయిందంటే ఆటోల్లో, రిక్షాల్లో బండిల్స్ కొద్దీ పుస్తకాలను వేసుకుని వచ్చి విక్రయదారులు అమ్ముతుంటారు.  పుస్తకాలను క్రమపద్దతిలో పేరుస్తుంటారు. ఒక్కో పుస్తకంపై రూ.10-20 మాత్రమే లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. మీకు కావాల్సిన పుస్తకం వారి వద్ద లేకపోతే ఎక్కడ దొరుకుంతుందో కూడా వాళ్లే చెప్తారు. విద్యార్థులు, పోటీ పరీక్షలు సిద్దమయ్యేవారు, పుస్తక ప్రియులు ఆదివారం వచ్చిందంటే చాలు అబిడ్స్‌ ప్రాంతంలో వాలిపోతారు. మంచి పుస్తకాలను అన్వేషించి నచ్చిన వాటిని కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరకే బుక్స్‌ కావాలనుకునేవారు ఆదివారం అబిడ్స్‌ మార్కెట్‌కు వెళ్లి ట్రై చేయోచ్చు. 

    3. అమీర్‌పేట మార్కెట్

    సాఫ్ట్‌వేర్ కోచింగ్ సెంటర్లకు అమీర్‌పేట్‌ను అడ్డాగా చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశం నలుమూల నుంచి వచ్చి టెకీ ఔత్సాహికులు సాప్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకుంటారు. అయితే అమీర్‌పేట పాత, కొత్త పుస్తకాలకు కూడా ఫేమస్ అని చెప్పొచ్చు. అమీర్‌పేటలోని బుక్స్‌స్టాల్స్‌లో సెకండ్ హ్యాండ్ బుక్స్‌ కూడా లభిస్తాయి. ఒరిజినల్‌ ప్రైస్‌తో పోలిస్తే సగం ధరకే వాటిని విక్రయిస్తుంటారు. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన బుక్స్‌ కూడా తక్కవ రేటుకే దొరుకుతాయి. హైదరాబాద్‌లో ఉండే టెక్కీలు అమీర్‌పేటకు వచ్చి వారికి కావాల్సిన బుక్స్‌ను తీసుకెళ్తుంటారు. వీలైతే మీరు కూడా ఓ సారి అమీర్‌పేట్‌ మార్కెట్‌పై లుక్‌ వేయండి. 

    4. దిల్‌సుఖ్‌ నగర్‌

    పోలీసు పరీక్షలకు సంబంధించిన కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు దిల్‌సుఖ్‌ నగర్‌ చాలా ఫేమస్‌. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతుంటారు. దీంతో ఈ ప్రాంతంలో బుక్స్‌ షాప్స్‌ విపరీతంగా ఉంటాయి. కొత్త బుక్స్‌తో పాటు, సెకండ్‌ హ్యాండ్‌వి కూడా ఇక్కడి స్టోర్స్‌లో లభిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు బుక్స్‌ కావాలంటే ఎక్కువగా దిల్‌సుఖ్‌ నగర్‌కే వస్తుంటారు. కాబట్టి తక్కువ ధరకు బుక్స్‌ కావాలంటే దిల్‌సుఖ్‌నగర్‌‌ని చుట్టేయండి. 

    5. లిబర్టీ స్టోర్, మాధాపూర్

    మాదాపూర్‌లోని శ్రీ సాయినగర్‌ ప్రాంతంలో గల లిబర్టీ స్టోర్‌ కూడా పాత పుస్తకాలకు మంచి గుర్తింపు పొందింది. ఈ స్టోర్‌ అన్ని రకాల పుస్తకాలు లభిస్తాయి. మీరు గనుక తక్కువ ధరలో పుస్తకాలు కోసం వెతుకుతుంటే కచ్చింతంగా స్టోర్‌ను విజిట్ చేయవచ్చు. ఈ స్టోర్‌లో రామకృష్ణ మఠ్‌ బుక్స్‌, పాత / కొత్త NCERT, ఇంజనీరింగ్‌ బుక్స్‌ మీరు చౌకనైన రేటుకు లభిస్తాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version