వీడియో: జూనియర్లను సీనియర్ల ర్యాగింగ్..ఎలా చేశారంటే

screen shot

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ర్యాగింగ్ విషయంలో విద్యార్థుల తీరు మాత్రం మారడం లేదు. పలు కాలేజీల్లో ఇంకా ఈ వికృత చేష్టలు కొనసాగుతునే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లాం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యూలో జూనియర్ విద్యార్థులు ఉండగా సీనియర్లు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చుడవచ్చు. ఈ విషయం తెలిసిన అక్కడి వైద్య విద్యాశాఖ మంత్రి స్పందించి విచారణకు ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది.

Exit mobile version