Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!

    Shivathmika: స్టన్నింగ్‌ లుక్స్‌లో శివాత్మిక అందాలు అదరహో..!

    November 16, 2023

    యంగ్‌ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ మరోమారు తన ‌అందచందాలతో సోషల్‌మీడియాను ఆకర్షించింది. ఈ అమ్మడి లేటెస్ట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    తాజా ఫొటోల్లో మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించిన ఈ భామ లేలేత అందాలను ఆరబోసింది. ఎద, నడుము ఒంపులను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. 

    స్టార్‌ హీరోయిన్‌ కావాలని భావిస్తున్న ఈ భామ తన ఒంపుసొంపులను ప్రదర్శించడంలో ఏ మాత్రం వెనకాడటం లేదు. 

    తనలో హోమ్లీ లుక్ మాత్రమే కాదు మోడ్రన్ లుక్ కూడా ఉందని దర్శకనిర్మాతలకు తెలిసేలా ఫోటో షూట్స్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఫ్యాషన్ డ్రెస్ వేసిన శివాత్మిక కెమెరాకు పోజులిచ్చింది.

    ప్రముఖ నటులు జీవిత-రాజశేఖర్ కుమార్తె అయిన శివాత్మిక 2019లో వచ్చిన దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పీరియాడిక్‌ లవ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

    దొరసాని తర్వాత ‘పంచతంత్రం’, ‘ఆకాశం’ చిత్రాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది శివాత్మిక. అయితే ఆ చిత్రాలు కూడా కమర్షియల్‌గా పెద్దగా ఆకట్టుకోలేదు.

    తాజాగా ‘రంగమార్తండ’ సినిమాలో శివాత్మిక మెరిసింది. బంగారం పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. 

    గత కొన్ని రోజులుగా శివాత్మిక సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటోంది. హాట్‌ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 

    శివాత్మిక పెట్టిన ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు. ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version