తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది.
నవంబర్ 29న ఒక అమ్మాయి, అబ్బాయికి జన్మనిచ్చినట్లు శ్రద్ధా స్పష్టత ఇచ్చింది. దీంతో అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2021లో నేవీ అధికారి రాహుల్ నగల్‌ను శ్రద్ధా పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో తాను కడుపుతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
శ్రద్ధా ఆర్య (Shraddha Arya) విషయాలకు వస్తే ఆమె 1987 ఆగస్టు 17న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది. ముంబయి యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు బుల్లితెరపై శ్రద్ధా ఆర్య మెరిసింది. జీ టీవీ (హిందీ)లో వచ్చిన ‘ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్ కి కోజ్’ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
ప్రముఖ నటుడు ఎస్.జే.సూర్య హీరోగా చేసిన తమిళ చిత్రం ‘కల్వనిన్ కాదలి’ (2006) సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నిశబ్ద్’ (2007) సినిమాలో నటించింది. అందులో రీతు ఆనంద్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
అదే ఏడాది ‘గొడవ’ (Godava) అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమైంది. ఇందులో వైభవ్‌కు జోడీగా అంజలి పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత తెలుగులో ‘కోతి మూక’ (Kothi Muka), ‘రోమియో’ (Romeo) వంటి చిత్రాల్లో శ్రద్ధా నటించింది. అయితే అవేమి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు.
దీంతో మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లి పోయిన శ్రద్ధా.. అక్కడ షాహిద్ కపూర్‌తో కలిసి ‘పాఠశాల’ (2010) సినిమా చేసింది. అందులో నటాషా సింగ్ పాత్రలో తళుక్కుమంది.
ఆ తర్వాత కన్నడలో అడుగుపెట్టిన ఆమె అక్కడ ‘డబుల్ డెక్కర్’, ‘మదువే మానే’ చిత్రాలు చేసింది. పంజాబిలో ‘బంజారా’ (2018) ఫిల్మ్‌లోనూ నటించింది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే సీరియల్స్‌లోనూ శ్రద్ధా ఆర్య నటించింది. ‘ష్‌ష్‌ష్.. పిర్ కోయి హై’ (2008) అనే హిందీ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.
‘మెయిన్ లక్ష్మీ తేరే ఆంగన్ కీ’, ‘డ్రీమ్ గర్ల్’, ‘కసమ్ తేరే ప్యార్ కి’, ‘కుండలి భాగ్య’ వంటి సీరియల్స్‌లో నటించి మరింత పాపులర్ అయ్యింది.
సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ సైతం శ్రద్ధా ఆర్య చేసింది. జీనా, సోనియో హిరియే, మెరీ జాన్, పీకే, కార్ గబ్రూ ది తదితర 10 మ్యూజిక్ వీడియోలు చేసింది.
శ్రద్ధా ఆర్య వ్యక్తిగత విషయాలకు వస్తే పెళ్లికి ముందు ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. 2015లో తొలుత ఎన్నారై జయంత్ రట్టితో నిశ్చితార్థం చేసుకుంది. అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకుంది.
ఆ తర్వాత 2019లో అలం సింగ్ మక్కర్‌తో రిలేషన్ షిప్‌లో అడుగుపెట్టింది. వారిద్దరు ‘నాచ్ బలియే’ (Nach Baliye) అనే డ్యాన్స్ షోలో కపుల్స్‌గా పోటీ చేశారు. షో పూర్తయ్యే సరికి వారి బంధం కూడా ముగిసింది.
ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్, టెలివిజన్ షోలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌ను శ్రద్ధా ఎంజాయ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరుచూ ఫొటోలు పెడుతూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..