ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు

    ప్రేక్ష‌కుల‌కు లేఖ‌తో థ్యాంక్స్ చెప్పిన ‘సీతా రామం’ ద‌ర్శ‌కుడు

    August 9, 2022

    Courtesy Twitter: hanu raghaapudi

    ‘సీతా రామం’ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో చిత్ర‌బృందం చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు ప్రేక్ష‌కులు త‌న‌ను ఇంత‌గా ప్రేమిస్తున్నందుకు దుల్క‌ర్ స‌ల్మాన్ కృత‌జ్బ‌త‌లు చెప్తూ ఒక లెట‌ర్ పోస్ట్ చేశాడు. తాజాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఒక లేఖ‌ను రాశాడు. ‘సినిమా క‌థను ఒక్క‌రే రాసుకోవ‌చ్చు. కానీ అనుకున్న క‌థ తెర‌పైకి రావాలంటే 24 క్రాఫ్ట్స్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నిర్మాణంలో ఎక్క‌డా లోటు లేకుండా అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చిన అశ్వినీద‌త్, వైజ‌యంతీ మూవీస్‌కు థ్యాంక్స్‌. సీతా రామం ఒక మంచి సినిమా అవుతుంది అనుకున్నాం కానీ, ఇంత ప్రేమ ద‌క్కుతుంది అనుకోలేదు. ఒక త‌రం వాళ్ల‌కు సీతా, రాముడు అంటే దుల్క‌ర్, మృణాల్ అని గుర్తొచ్చేలా గొప్ప‌గా న‌టించారు’ అని చెప్పుకొచ్చాడు. హ‌ను రాఘ‌వ‌పుడి రాసిన లేఖ‌ను చ‌దివేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version