Sita Ramam Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sita Ramam Movie Review

    Sita Ramam Movie Review

    August 5, 2022

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’ మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మ్యూజిక్ అందించాడు. ర‌ష్మిక‌, సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్, గౌతమ్ మీన‌న్‌, భూమిక త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించారు. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. మ‌రి మూవీ ఎలా ఉంది? స్టోరీ ఎంటి? తెలుసుకుందాం

    క‌థేంటంటే..

    1985లో పాకిస్తాన్‌కు చెందిన మేజ‌ర్ త‌న మ‌న‌వ‌రాలు అఫ్రీన్ (ర‌ష్మిక‌)కు లెఫ్టినెంట్ రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్‌) రాసిన ఒక లేఖ‌ను ఇస్తాడు. 20 ఏళ్ల కింద రాసిన ఆ లేఖ‌ను దీన్ని ఎలాగైనా సీతా మ‌హాలక్ష్మికి(మృణాల్ ఠాకూర్‌) చేర‌వేయాల‌ని బాధ్య‌త అప్ప‌గిస్తాడు. ఇక అప్ప‌టినుంచి అఫ్రీన్,సీతా రామ్‌ల ల‌వ్‌స్టోరీ ఎంటీ వాళ్లు ఎలా క‌లుసుకున్నారు ఇప్పుడు సీతా మ‌హాల‌క్ష్మీ ఎలా ఉంద‌ని వెతికే ప‌నిలో ప‌డుతుంది. 

    లెఫ్టినెంట్ రామ్ ఒక అనాథ‌. దేశం కోసం ప‌నిచేయ‌డం, త‌న సైన్యం త‌ప్ప ఇంకేమి తెలియ‌వు. కానీ అనుకోకుండా అత‌డ‌కి సీతా మ‌హాల‌క్ష్మీ పేరుతో ప్రేమ లేఖ‌లు రావ‌డం ప్రారంభ‌మ‌వుతాయి. కానీ తిరిగి ఉత్త‌రం రాద్దామంటే చిరునామా ఉండ‌దు. అలా ఉత్త‌రాల కోసం ఎదురుచూస్తుంటాడు. అనుకోఉకుండా ఒక‌రోజు సీత‌ను క‌లుస్తాడు. ప్రేమించుకుంటారు. కానీ మ‌ళ్లీ విడిపోతారు. ఇంత‌కు వాళ్లు ఎందుకు విడిపోయారు?  సీత కోసం రామ్ రాసిన లేఖ పాకిస్తాన్‌కు ఎందుకు చేరింది?. అఫ్రీన్ చివ‌రికి సీత‌ను క‌లుసుకుంటుందా ఆ లేఖ‌లో ఏముంది? తెలియాలంటే తెర‌పై చూడాల్సిందే

    విశ్లేష‌ణ‌:

    ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పుడి సినిమాలంటే ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీ ఉంటుంది.  యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థగా వ‌చ్చిన సీతా రామం స్టోరీ చాలా బలంగా రాసుకున్నాడు. మ్యూజిక్ ఈ సినిమాకు సోల్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక క‌శ్మీర్ అందాల‌ను తెర‌పై మ‌నోహ‌రంగా చూపించ‌డంలో సినిమాటోగ్ర‌ఫర్లు పీఎస్ వినోద్, శ్రేయ‌స్ కృష్ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. ప్ర‌తి స‌న్నివేశం తెర‌పై ఒక చ‌క్క‌టి పేయింట్‌లా క‌నిపిస్తుంది. వైజయంతి మూవీస్ నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ఆ రిచ్‌నెస్ క‌నిపిస్తుంది.

     దుల్క‌ర్ స‌ల్మాన్ రామ్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌లో ఆయ‌న క‌ళ్ల‌తోటే ప్రేమ‌ను ప‌లికించే విధానం ఆక‌ట్టుకుంటుంది. మృణాల్ ఠాకూర్ సాంప్ర‌దాయ దుస్తుల‌తో తెర‌పై అందంగా క‌నిపించింది. ఆమె అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఈ పాత్ర‌కు స‌రైన ఎంపిక అని చెప్ప‌వ‌చ్చు. ఇక ర‌ష్మిక ఇంత‌కు ముందెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో న‌ట‌న అద‌ర‌గొట్టింది. అఫ్రీన్‌గా ఆమె పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. అఫ్రీన్‌కు సాయం చేసే బాలాజీగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు త‌రుణ్ భాస్క‌ర్. సుమంత్ చాలా కాలం త‌ర్వాత ఒక మంచి పాత్ర‌లో క‌నిపించాడు. ఈ పాత్ర సినిమాకు చాలా కీల‌కం అని చెప్ప‌వ‌చ్చు. వెన్నెల కిశోర్, గౌత‌మ్ మీన‌న్, మ‌నోజ్ త‌దిత‌రులు అన్ని పాత్ర‌ల ఎంపిక చ‌క్క‌గా కుదిరింది. మొద‌టి భాగం మొత్తం ల‌వ్‌స్టోరీ, రొమాన్స్, స‌స్పెన్స్‌తో ఆక‌ట్టుకుంటుంది. రెండో భాగంలో ఎమోష‌న్స్ మ‌న‌సును హ‌త్తుకుంటాయి. ఇదొక క్లాసిక్‌ లవ్‌స్టోరీగా నిలిచిపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

    బ‌లాలు:

    న‌టీన‌టులు

    మ్యూజిక్

    క‌థ‌

    సినిమాటోగ్ర‌ఫీ

    బ‌ల‌హీన‌త‌లు:

    నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం

    రేటింగ్: 4/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version