‘సీతా రామం’ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ రిలీజ్

‘సీతా రామం’ నుంచి తాజాగా ఒక డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేశారు. అఫ్రీన్‌గా న‌టించిన ర‌ష్మిక సీత గురించి తెలుసుకునేందుకు నూర్జ‌హాన్ ప్యాలెస్‌కు వెళ్తుంది. ఆ స‌మ‌యంలో క్యాబ్‌లో ఆమె బ్యాగ్‌, పాస్‌పోర్ట్‌, వీసా అన్ని మ‌రిచిపోతుంది. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి ఆ క్యాబ్ డ్రైవ‌ర్ అక్క‌డే ఉంటాడు. దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఆమె ఇండియాలో ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అడుగుతుంది. మా దేశంలో అంద‌రూ ఇలానే ఉంటారు మేడ‌మ్. మీ బ్యాగ్ తీసుకొని వెళ్లి మా దేశం ప‌రువు తీయ‌లేను అని చెప్తాడు. ఈ సీన్ సినిమాలో ఉంటే ఇంకా బాగుండేది.

Exit mobile version