10 మిలియ‌న్ వ్యూస్‌ క్రాస్ చేసిన ‘సీతా రామం’ ట్రైల‌ర్‌

దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర జంట‌గా న‌టించి సీతా రామం ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 10 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సెన్సార్ బోర్డు నుంచి కూడా మూవీకి U స‌ర్టిఫికెట్ రావ‌డం విశేషం. ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్, సుమంత్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ను రాఘ‌వ‌పుడి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సీతా రామం ఆగ‌స్ట్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Exit mobile version