Smart Tv 32 inch offers: టాప్‌ స్మార్ట్‌ టీవీ కొనాలని భావిస్తున్నారా?. ఇదే బెస్ట్‌ టైమ్‌.. వీటిని ట్రై చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Smart Tv 32 inch offers: టాప్‌ స్మార్ట్‌ టీవీ కొనాలని భావిస్తున్నారా?. ఇదే బెస్ట్‌ టైమ్‌.. వీటిని ట్రై చేయండి!

    Smart Tv 32 inch offers: టాప్‌ స్మార్ట్‌ టీవీ కొనాలని భావిస్తున్నారా?. ఇదే బెస్ట్‌ టైమ్‌.. వీటిని ట్రై చేయండి!

    October 1, 2023

    దేశంలో పండగ సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అద్బుతమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే నాణ్యమైన ప్రొడక్ట్స్‌ను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెజాన్‌ 32 అంగుళాల టీవీపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఊహించని డిస్కౌంట్లతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ టీవీ కోసం ఎదురుచూసేవారికి ఇదే మంచి అవకాశం లభిస్తోంది. అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తోన్న టాప్‌ బ్రాండ్ టీవీలను (Only 32 inches) YouSay మీ ముందుకు తెచ్చింది. వాటిపై ఓ లుక్కేయండి. 

    Panasonic (32 inches) HD TV

    తక్కువ బడ్జెట్‌లో పానాసోనిక్‌ (Panasonic) టీవీని కోరుకునేవారు Panasonic (32 inches) HD TV పరిశీలించవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime), Zee5, యూట్యూబ్‌ (Youtube) సపోర్ట్‌తో ఇది వస్తోంది. Vivid Digital Pro, డాల్బీ డిజిటల్‌ (Dolby Digital), ఆడియో  బూస్టర్‌ ప్లస్‌ (Audio Booster+), గూగుల్‌ అసిస్టెంట్‌ (Google Assistant) ఇందులో ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. దీని అసలు ధర రూ.20,990. అమెజాన్‌ దీనిపై 24% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఈ టీవీని రూ.15,990 దక్కించుకోవచ్చు. 

    Samsung Wondertainment Series HD

    రూ.15 వేల లోపు మంచి శాంసంగ్‌ స్మార్ట్‌టీవీని కోరుకునేవారు ‘Samsung Wondertainment Series HD’ ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ.22,900 కాగా అమెజాన్‌ దీనిపై 35% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.14,990కే లభిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, Zee5, SonyLiv, యూట్యూబ్‌, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ వేదికలకు సపోర్ట్ చేస్తుంది. 

    Redmi Android 11 Series 

    గత కొంత కాలంగా రెడ్‌మీ కూడా మంచి స్మార్ట్‌ టీవీలను రిలీజ్‌ చేస్తోంది. రూ.11 వేలు మీ బడ్జెట్‌ అయితే Redmi Android 11 Series టీవీని ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ. 24,999. కానీ అమెజాన్‌ దీనిపై 58% డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.10,499కే అందుబాటులోకి వచ్చింది.  

    LG HD Ready Smart LED TV

    LG నుంచి కూడా క్వాలిటీ స్మార్ట్‌టీవీలు అమెజాన్‌లో ‌అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్‌లో LG టీవీ కోరుకునే వారికి LG HD Ready Smart LED TV మంచి ఆప్షన్‌. దీని అసలు ధర రూ.21,990 కాగా అమెజాన్ దీనిపై 39% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీని వల్ల ఈ టీవీని రూ.13,490లకే దక్కించుకోవచ్చు. 

    OnePlus (32 inches) Y Series HD 

    ఈ టీవీ 32 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్‌తో పనిచేయనుంది. 64 bit పవర్‌ఫుల్‌ ప్రొసెసర్‌ను కలిగి ఉంది. ఈ టీవి ఒరిజినల్‌ ప్రైస్‌ రూ. 19,999 కాగా అమెజాన్‌ దీనిని రూ.14,999 అందజేస్తోంది. 

    TCL (32 inches) Android TV

    రూ. 10 వేలలో మంచి ఆండ్రాయిడ్‌ టీవీ కావాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ సహా అన్ని ఓటీటీ వేదికలకు సపోర్టు చేస్తుంది. 768p రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 1.5 GB RAM / 16 GB ROM, 64 bit Quad Core Processorతో ఇది వర్క్ చేస్తుంది. అమెజాన్‌లో ఇది రూ.9,990లకు లభిస్తోంది.

    Acer (32 inches) Android Smart LED TV

    ఇది గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ సర్వీస్‌ అప్లికేషన్స్‌, గూగుల్ ప్లేస్టోర్‌ (Google play store), నెట్‌ఫ్లిక్స్‌, Zee5, యూట్యూబ్‌కు సపోర్ట్ చేస్తుంది. 768p రిజల్యూషన్‌, 60 Hz రిఫ్రెష్‌ రేటును కలిగి ఉంది. దీని అసలు ధర రూ.19,990 కాగా అమెజాన్‌ దీనిపై 45% డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఫలితంగా ఇది రూ.10,999కే లభిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version