Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!

    Sobhita Dhulipala: తల్లి కావడంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి గురించి పెద్దగా కలలు లేవట!

    September 26, 2024

    అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ ఈ జంట ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే పెళ్లి పీటలు సైతం ఎక్కనుంది. ఇక చైతూతో ఎంగేంజ్‌మెంట్‌ తర్వాత నుంచి శోభిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా, కామెంట్స్‌ చేసినా క్షణాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంగేజ్‌మెంట్‌ తర్వాత శోభిత తన మెుదటి ఇంటర్యూ ఇచ్చింది. చైతూతో పెళ్లి, మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

    ‘నిశ్చితార్థం గురించి కలలు కనలేదు’

    తను నటించిన లవ్‌, సితార చిత్రం ఓటీటీ ప్రమోషన్స్‌లో భాగంగా నటి శోభిత దూళిపాల తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని ఎప్పుడు కలలు కనలేదని తెలిపారు. వాటి కోసం ప్రత్యేకంగా ప్లాన్స్‌ కూడా వేసుకోలేేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తన పెళ్లి వేడుకలు సాంప్రదాయంగా సింపుల్‌గా జరిగితే చాలని భావించానని అన్నారు. అనుకున్నట్లే చైతూతో సింపుల్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని అన్నారు. ఇక తన తల్లిదండ్రులు పాటించే సంసృతి, సంప్రదాయాలను తానూ గౌరవిస్తాని శోభిత స్పష్టం చేసింది. అందుకే తాను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలని కోరుకుంటానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చైతూతో పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

    ‘చైతూలో ఆ ప్రేమ చూశా’

    నటుడు నాగచైతన్యతో నిశ్చితార్థం అనంతరం సంబంధిత ఫొటోలను షేర్‌ చేస్తూ కవిత్వంతో కూడిన ఆసక్తికర పోస్టు శోభిత పెట్టారు. ఆ విధంగా పోస్టు పెట్టడానికి గల కారణాన్ని తాజా ఇంటర్యూలో శోభిత వెల్లడించారు. ‘సంగం సాహిత్యానికి (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది) నేను విపరీతమైన అభిమానిని. నా పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం గతంలో నేను చదివినది. అది ఎంతో కవితాత్మకం. సరళంగా ఉంటుంది. హృదయాలను హత్తుకునే సందేశం అందులో ఉంది. అందుకే అది నా మనసులో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. నేను ఎల్లప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామిలో అదే ప్రేమను చూశా’ అని శోభితా ధూళిపాళ్ల వివరించారు. 

    రెండేళ్లుగా ప్రేమాయణం!

    నాగ చైతన్య – శోభిత మధ్య నిశ్చితార్థం వ్యవహారం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఇందుకు కారణం వారు రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంత కాలంగా వార్తలు రావడమే. చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఇవాళ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది. 

    శోభితా గురించి ఈ విషయాలు తెలుసా!

    శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల ‘మంకీ మాన్‌’ అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో ‘లవ్‌, సితారా’ అనే చిత్రం నటించింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. 

    సమంతతో విడాకులు

    స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ను గతంలో నాగ చైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఏం మాయ చేశావే’ (Ye Maaya Chesave) సినిమాతో చైతు-సమంతకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 2017లో వివాహ బంధం ద్వారా వారిద్దరు ఒక్కటయ్యారు. బెస్ట్‌ కపుల్‌ అంటూ ప్రసంశలు కూడా అందుకున్నారు. అటువంటిది నాలుగేళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అభిమానులకు షాకిస్తూ 2021లో నాగ చైతన్య, సమంత విడిపోయారు. ప్రస్తుతం ఎవరి దారి వారిది అన్నట్లుగా జీవిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చైతు మరో పెళ్లికి రెడీ కావడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version