Sony WF-1000XM5 Review: సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. ధర ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sony WF-1000XM5 Review: సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. ధర ఎంతంటే?

    Sony WF-1000XM5 Review: సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. ధర ఎంతంటే?

    November 5, 2023

    టెక్‌ దిగ్గజం సోనీ (Sony) సరికొత్త ఇయర్‌ బడ్స్‌ (Earbuds)ను ఇటీవల మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది.  ఈ ఇయర్‌ బడ్స్‌ మంచి సెల్స్‌ ఆక్యూపెన్సీని సంపాదించింది. నాయిస్ క్యాన్సిలింగ్ నాణ్యత పరంగా మునుపటి మోడల్‌ల కంటే తాజా ఇయర్‌బడ్స్‌లో మెరుగ్గా ఉన్నాయని సోనీ పేర్కొంది. సోనీ 1000X సిరీస్ ప్రీమియం సౌండ్ క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. డీసెంట్ బ్యాటరీ లైఫ్, స్లీక్ డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ ఇయర్ బడ్స్‌ను YouSay Web సమీక్షించడం జరిగింది. మరి ఈ ఇయర్‌ బడ్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

    డిజైన్‌ &స్పెసిఫికేషన్లు

    ఇయర్‌బడ్‌లు బ్లాక్,  ప్లాటినం సిల్వర్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. రెండూ వైపులా నిగనిగలాడే షైనీ ఫినిషింగ్‌ను కలిగి ఉన్నాయి. గతేడాది రిలీజ్ అయిన WF-1000XM4 కంటే 25 శాతం చిన్నవి20 శాతం తేలికైనవి. ఇక చెవిలో ఫిట్టింగ్ విషయానికొస్తే బాగా సరిపోయాయి.  సోనీ నాలుగు వేర్వేరు సైజుల్లో ఇయర్ టిప్స్‌ అందించింది,  ప్లేబ్యాక్‌ని కంట్రోల్ చేసేందుకు ఇయర్‌బడ్‌లు టచ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి నాయిస్ క్యాన్సిలేషన్‌ను కూడా కలిగి ఉన్నాయి.

    ఇయర్‌ఫోన్స్, కేస్ రీసైకిల్ ప్లాస్టిక్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. Sony WF-1000XM5లో టచ్ కంట్రోల్‌లు Sony హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. మల్టీపాయింట్ కనెక్షన్, యాంబియంట్ సౌండ్ కంట్రోల్, స్పీక్-టు-చాట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  వాయిస్ అసిస్టెంట్‌ ద్వారా అడాప్టివ్ సౌండ్ కంట్రోల్‌ని, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని మార్చవచ్చు.

    స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ప్రతి ఇయర్‌బడ్‌లో 8.4mm డైనమిక్ డ్రైవర్ X ఉంటుంది. ఇయర్‌బడ్‌లు ఇంటిగ్రేటెడ్ Sony ప్రాసెసర్ V2పై రన్‌ అవుతాయి. బోన్ కండక్షన్ సెన్సార్‌, డీప్ న్యూరల్ నెట్‌వర్క్ ప్రోగ్రామింగ్ వల్ల WF-1000XM5 అత్యుత్తమ కాల్ నాణ్యతను కలిగి ఉందని సోనీ పేర్కొంది.  

    ఇయర్‌ఫోన్‌లు బ్లూటూత్ 5.3, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మల్టీపాయింట్ కనెక్షన్  360 రియాలిటీ ఆడియోను సపోర్ట్ చేస్తాయి. ఇయర్ బడ్స్ 20Hz నుంచి 20,000Hz (LDACతో 40,000Hz వరకు) ఫ్రీక్వెన్సీ లిమిట్ కలిగి ఉన్నాయి. అంతేకాదు సోని ఇయర్‌బడ్‌లు వాటర్ రెసిస్టెంట్ IPX4 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి, అయితే కేస్ వాటర్ రెసిస్టెంట్ మాత్రం కాదు.

    సోని ఇయర్ బడ్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌తో కనెక్ట్ చేసినప్పుడు..  నాణ్యమైన సౌండ్ క్వాలిటీ,  స్పేషియల్ ఆడియో అవుట్‌పుట్ సూపర్బ్‌గా ఉంది. విభిన్నమైన మోడ్స్‌లో పాటలను ప్లే చేసినప్పుడు.. క్రిస్టల్ క్లియర్ సౌండ్, బాస్ నాణ్యత బాగుంది. గిటార్, బాస్ గిటార్, డ్రమ్స్ వంటి శబ్దాలు మంచి స్పష్టతతో వినిపించాయి. 

    సోని ఇయర్ బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. ఇండోర్, అవుట్‌డోర్‌లో బయటి శబ్దాలను చాలా యాక్టివ్‌గా తొలగించాయి. వీధిలో నడిచేటప్పుడు గాలి, ఇంట్లోని ఫ్యాన్, టీవీ శబ్దాలు, ఎయిర్ కండీషనర్  వంటి ఇతర శబ్దాలను సమర్థవంతంగా ఫిల్టర్ చేసింది. ట్రాన్సపరెంట్ మోడ్ కూడా ఇయర్ బడ్స్‌లో బాగా పనిచేసింది.

    బ్యాటరీ విషయానికి వస్తే ఇయర్ బడ్స్ లాంగ్ లైఫ్‌ను కలిగి ఉన్నాయి.  ANC,  బ్లూటూత్ యాక్టివేషన్‌తో 8 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని సోనీ క్లెయిమ్ చేసింది. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆఫ్ చేస్తే..  12 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని ఎంజాయ్ చేయవచ్చు.  వైర్డ్ ఛార్జింగ్‌తో ఇయర్‌బడ్‌లు పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 1.5 గంటలు పట్టింది.

    ఇయర్‌బడ్స్‌ ధర 

    ఈ ఇయర్‌బడ్స్‌ ధరను సోనీ రూ.24,990గా సోనీ నిర్ణయించింది. ప్రీ ఆర్డర్‌పై రూ.3000 క్యాష్‌ బ్యాక్‌తో పాటు , SRS-XB100BT Speakerను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. 

    ఫైనల్‌గా

    అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్సపరెన్సీ మోడ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, లైటర్ డిజైన్ …సోనీ WF-1000XM5 ఇయర్ బడ్స్‌లో బలమైన అంశాలు. అయితే దీని ధర కాస్త ఎక్కువైనప్పటికీ… క్రిస్టల్ క్లియర్ ఆడియో ప్యాకేజీని అనుభవించాలి అని కోరుకునే వారికి.. ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఛాయిస్. అయితే, మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మాత్రం AirPods ప్రో (2Gen) బెస్ట్ ఛాయిస్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version