Sophie Choudry: పలుచటి చీరలో కనువిందు చేస్తున్న సోఫి అందాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sophie Choudry: పలుచటి చీరలో కనువిందు చేస్తున్న సోఫి అందాలు

    Sophie Choudry: పలుచటి చీరలో కనువిందు చేస్తున్న సోఫి అందాలు

    November 16, 2023

    బాలీవుడ్‌ నటి, ప్రముఖ సింగర్‌ సోఫి చౌదరి (Sophie Choudry) మరోమారు తన గ్లామర్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. తళతళ మెరిసే సిల్వర్‌ కలర్ శారీలో ఎద అందాలను ఆరబోసింది.

    పలుచటి శారీలో టైట్‌ఫిట్‌ జాకెట్‌తో సోఫిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 40 ఏళ్ల వయసులోనూ సోఫి అందం ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. 

    ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జన్మించిన ఈ భామ.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సింగింగ్‌పై ఆసక్తితో తన 12వ ఏట నుంచే సోఫీ ఆ దిశగా అడుగులు వేసింది.

    2000ల సంవత్సరం నుంచి పాప్‌ సింగర్‌గా సోఫీ తన కెరీర్‌ను ప్రారంభించింది. ‘ఏ దిల్‌ సున్‌ రహా హై’, ‘హబిబి’ పాటలను స్వయంగా రాసి పాడింది. అలాగే పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ సైతం చేసింది.  

    పాపులర్‌ షో MTV Lovelineకు హోస్ట్‌గా వ్యవహరించిన సోఫీ.. ‘బేబీ లవ్‌’ ఆల్బమ్‌ సక్సెస్‌తో మరింత పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌ సినిమాల నుంచి అవకాశాలు చుట్టుముట్టాయి. 

    2005లో సంజయ్‌ దత్‌ హీరోగా చేసిన షాది నెం.1 సినిమాతో సోఫి సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో డింపుల్‌ కొతారి పాత్ర పోషించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది.

    ఆ తర్వాత వరుసగా ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఐ సీ యూ, హే బేబి, అగర్‌, స్పీడ్‌, మనీ హై తో హనీ హై, కిడ్నాప్‌, డాడీ కూల్‌, చింటూజీ, అలిబాగ్‌, వేడి, షూటౌట్‌ ఎట్‌ వాలా వంచి బాలీవుడ్‌ చిత్రాల్లో ఆమె నటించింది. 

    తెలుగులో మహేష్‌ హీరోగా చేసిన ‘వన్‌ నేనొక్కడినే’ సినిమాలో లండన్‌ బాబు పాటలో సోఫి చౌదరి మెరిసింది. అద్భుతమైన స్టెప్పులతో తెలుగు ఆడియన్స్‌ను అలరించింది. 

    ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో టెలివిజన్‌ ప్రెజంటర్‌గా పలు షోలను సోఫీ చేస్తోంది. అటు సోషల్‌మీడియాలోనూ చురుగ్గా వ్యవహిస్తోంది. 

    సోఫీ ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version