Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి

    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి

    April 6, 2023

    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది.

    టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది.

    ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది.

    ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి అందాల జాతర చేస్తోంది. ఒక్క పక్క టెలివిజన్ షోలు చేస్తూనే ఇన్‌స్టాలో హాట్ షో చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.

    కొద్దిరోజులుగా శ్రీముఖి ఇన్‌స్టాలో హట్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోంది. తాజాగా మిల్కీ వైట్, లైట్ పింక్ లెహంగాలో ఈ శ్రీముఖి తళుక్కున మెరిసింది.

    ఎప్పటికప్పుడూ హాట్ ఫొటో షూట్లతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతోంది. తన ప్రతి గ్లామరస్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

    సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. బిగ్ బాస్ 3 రన్నరప్‌ తర్వాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది.

    అప్పట్లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ పొత్తినేని సిస్టర్ క్యారెక్టర్ చేసింది. 

    తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాలోనూ శ్రీముఖి మెరిసింది. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఈ అల్లరి పిల్ల ఎదురుచూస్తోంది.

    బీబీజోడీ, పటాస్ వంటి టెలివిజన్ షోలతో క్రేజ్ సంపాదిస్తోంది. మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ దూసుకెళ్తోంది

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version