SSMB 30: మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SSMB 30: మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!

    SSMB 30: మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!

    March 27, 2024

    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో కొత్తగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్‌ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో మహేష్‌ నాల్గోసారి సినిమా చేయబోతున్నట్లు బజ్‌ వినిపిస్తోంది. 

    మహేష్‌ – గురూజీ కాంబోలో..!

    రాజమౌళితో సినిమా తర్వాత మహేష్‌ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తీయనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మహేష్‌ రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ (Guntur Karam)తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. SSMB 29 తర్వాత కూడా మహేష్‌ తిరిగి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘SSMB 30’ పేరుతో రానున్న ఈ చిత్రం.. భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందట. ‘గుంటూరు కారం’ షూటింగ్‌ టైమ్‌లోనే ఈ సినిమా కథ గురించి డిస్కషన్‌ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రూపొందటానికి చాలా సమయం పట్టనుంది. 

    త్రివిక్రమ్‌కు మాటిచ్చిన మహేష్‌!

    SSMB30 సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందనున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ సమయంలోనే మరోమారు కలిసి పనిచేద్దామని మహేష్ అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ అది నెరవేరలేదు. అయితే మహేష్‌ ప్రామిస్ చేసినా కూడా SSMB30 పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version