బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రాలతో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని మహేష్ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కూడా నటిస్తారని తెలుస్తోంది. మలయాళం నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆ నటులతో రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చర్చలు గాని ఫలిస్తే SSMB29 పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే దీనిపై రాజమౌళి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మహేష్‌తో చేయబోయే చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో నిర్మించేందుకు డైరెక్టర్ రాజమౌళి కసరత్తు చేస్తున్నాడు. కౌబాయ్ తరహాలో తెరకెక్కనున్న ఈ అడ్వెంచర్ మూవీ కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్‌ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తారని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB28 చిత్రం షూటింగ్‌లో మహేష్ బాబు బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను ఫాస్ట్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసేందుకు మహేష్ కష్టపడుతున్నాడు. ఈ సినిమా షూట్ పూర్తి కాగానే రాజమౌళి ప్రాజెక్ట్‌లో మహేష్ జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దీంతో SSMB 29 షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కావొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!