Jio Motive: జియో నుంచి సరికొత్త ఆవిష్కరణ.. కార్లను స్మార్ట్‌గా మార్చే అద్భుతమైన డివైజ్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jio Motive: జియో నుంచి సరికొత్త ఆవిష్కరణ.. కార్లను స్మార్ట్‌గా మార్చే అద్భుతమైన డివైజ్!

    Jio Motive: జియో నుంచి సరికొత్త ఆవిష్కరణ.. కార్లను స్మార్ట్‌గా మార్చే అద్భుతమైన డివైజ్!

    November 7, 2023

    సాధారణ కారును స్మార్ట్‌గా మార్చాలని భావిస్తున్నారా?  కొత్త కారు కొనకుండానే మోడ్రన్‌ కారు ఫీచర్లు పొందాలని ప్రయత్నిస్తున్నారా? అలాంటి వారికి రిలయన్స్‌ జియో (Reliance Jio) అదిరిపోయే శుభవార్త చెప్పింది. కారును స్మార్ట్‌గా మార్చడంతో పాటు రక్షణగా నిలిచే సరికొత్త డివైజ్‌ను రిలీజ్ చేసింది. జియోమోటివ్ (JioMotive) పేరుతో ఈ డివైజ్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇందులో కారుకు అవసరమైన ఎన్నో ఫీచర్లు ఉన్నట్లు జియో చెప్పింది. ఈ నేపథ్యంలో డివైజ్‌ వినియోగం, ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఎక్కడ ప్లగ్ చేయాలి?

    జియోమోటివ్‌ (JioMotive)ను కారు ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) పోర్ట్‌లోకి ప్లగ్ ఇన్ చేయవచ్చు. OBD సాధారణంగా డాష్‌బోర్డ్ కింద ఉంటుంది. ఈ డివైజ్‌ e-SIMతో ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతుంది. ఆ e-SIM.. యూజర్ ఇప్పటికే కలిగి ఉన్న జియో నంబర్ డేటా ప్లాన్‌ను షేర్ చేసుకుంటుంది. యూజర్ డివైజ్‌ కోసం ప్రత్యేక SIM కార్డ్ లేదా డేటా ప్లాన్‌ను కొనుగోలు చేయనవసరం లేదు.

    ఎలా ఉపయోగించాలి?

    యూజర్ స్మార్ట్‌ఫోన్‌లో జియోథింగ్స్ (JioThings) యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత జియో నంబర్‌తో జియోథింగ్స్‌కు లాగిన్ లేదా సైన్ అప్ చేయాలి. “+“పై క్లిక్ చేసి జియోమోటివ్‌ను ఎంచుకోవాలి. జియోమోటివ్‌ బాక్స్ లేదా డివైజ్‌పై ఉన్న IMEI నంబర్‌ను ఎంటర్ చేసి, ‘కంటిన్యూ’పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, కారు పేరు, మోడల్, ఫ్యూయల్ టైప్ వంటి కారు వివరాలను ఎంటర్ చేసి ‘సేవ్’పై నొక్కాలి. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి కారులోని వివిధ అంశాలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి యాప్ వినియోగించొచ్చు. యాప్ 200+ కంటే ఎక్కువ ఇంజన్ డయాగ్నస్టిక్ కోడ్స్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.

    జియోమోటివ్‌ ఫీచర్లు

    GPS ట్రాకింగ్

    యాప్‌ ఉపయోగించి కారు రియల్-టైమ్ లొకేషన్‌ను యూజర్ ట్రాక్ చేయవచ్చు. కారు నడిపిన లొకేషన్ హిస్టరీ కూడా చూడవచ్చు.

    థెఫ్ట్ అలర్ట్స్

    జియోమోటివ్‌ డివైజ్‌ కార్లకు స్మార్ట్‌ రక్షణను అందిస్తుంది. ఇందులో భాగంగా థెఫ్ట్‌ అలెర్ట్స్‌ కోసం జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్స్ ఫీచర్లను సెటప్ చేసుకోవచ్చు. 

    ఇంజన్ పనితీరు

    యూజర్ యాప్‌ని ఉపయోగించి కారు బ్యాటరీ హెల్త్, ఇంజన్ లోడ్, కూలంట్‌ టెంపరేచర్, ఎయిర్ ఇన్‌టేక్ టెంపరేచర్ చెక్ చేయవచ్చు.

    డ్రైవర్‌ బిహేవియర్

    కారు అద్దెకు ఇచ్చినవారికి జియోమోటివ్ డివైజ్‌ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యాప్‌ని ఉపయోగించి డ్రైవింగ్ హ్యాబిట్స్, బిహేవియర్‌పై అవగాహన పొందవచ్చు. స్పీడ్, యాక్సిలరేషన్, బ్రేకింగ్, కార్నరింగ్, ఫ్యూయల్ ఎఫీషియెన్సీ వంటి మెట్రిక్స్ చూడవచ్చు. డ్రైవింగ్ స్కిల్స్ ఎలా మెరుగుపరుచుకోవాలి, ఫ్యూయల్ ఎలా ఆదా చేయాలి అనే దానిపై టిప్స్, సజెషన్స్ కూడా ఇవ్వవచ్చు.

    బేసిక్‌ కార్లకు కూడా..

    జియోమోటివ్.. ఇన్-బిల్ట్ ఫ్యాన్సీ ఫీచర్లు లేని కార్లకు కూడా కనెక్టెడ్-కారు ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు యూజర్ భద్రత, సౌలభ్యం, సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. మెకానిక్ లేదా సర్వీస్ సెంటర్‌కు అనవసరమైన సందర్శనలను నివారించి వినియోగదారు డబ్బు, సమయాన్ని ఆదా చేస్తుంది. 

    ధర ఎంతంటే?

    జియోమోటివ్‌ డివైజ్‌ ధరను రిలయన్స్‌ రూ.4,999గా నిర్ణయించింది. ఈ సేవలు పొందడానికి ప్రతీ ఏటా రూ. 599 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది సేవలు ఉచితంగా అందిస్తారు. ఈ డివైజ్‌ను Amazon, Reliance Digital. ఇతర ఈ-కామర్స్ సైట్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version