Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!

    Summer Special Drinks: మండు వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచే టాప్‌-10 శీతల పానియాలు ఇవే..!

    May 9, 2023

    తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మళ్లీ మెుదలయ్యాయి. నిన్న, మెున్నటి వరకూ వర్షాలతో సేద తీరిన ప్రజలు వేసవి తాపంతో తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిగుండంలా మండుతున్న సూర్యుడ్ని చూసి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండవేడిమి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాహ్యా శరీరంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మర్‌లో ఎలాంటి డ్రింక్స్‌ తాగాలి? శరీరాన్ని చల్లగా ఉంచే సమ్మర్‌ స్పెషల్‌ డ్రింక్స్‌ ఏవీ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. 

    1. వాటర్‌ మిలాన్‌ చిల్లర్‌

    వేసవి స్పెషల్ ఫ్రూట్‌గా పుచ్చకాయకు పేరుంది. పుచ్చకాయతో చేసే జ్యూస్‌ను చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ‘వాటర్‌ మిలాన్‌ చిల్లర్‌’ రెగ్యూలర్ జ్యూస్‌కు భిన్నం. పుచ్చకాయ ముక్కలతో పాటు, దానిమ్మ, నిమ్మరసం వేసి ఈ జ్యూస్‌ను తయారు చేస్తారు. ఇది తాగడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.  అంతేకాకుండా శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలస్ట్రాల్ ఉండదు. గ్లాసు వాటర్‌మిలన్ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బోహైడ్రేడ్స్, 1.1 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందుతుంది. ఇది వేసవిలో బెస్ట్‌ డ్రింక్‌ అని చెప్పొచ్చు.

     

    2. మామిడి పన్నా

    వేసవిలో మాత్రమే లభించే పండ్లలో మామిడి కాయ ఒకటి. దీనికి పండ్ల రారాజుగా పేరుంది. అలాంటి మ్యాంగోతో జ్యూస్‌ అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఈ సమ్మర్‌లో మ్యాంగో పన్నా జ్యూస్‌ తాగడం ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. మామిడి గుజ్జు, జీలకర్ర, పుదీనా ఆకులతో ఈ జ్యూస్‌ చేస్తారు. దేశంలో ఇది చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అందిస్తుంది. తక్షణం మీ బాడీని డీహైడ్రేట్‌ నుంచి కాపాడుతుంది. 

    3. మ్యాంగో లస్సీ

    మ్యాంగో లస్సీ కూడా ఈ సమ్మర్‌లో అద్భుతమైన డ్రింక్‌ అని చెప్పొచ్చు. దీనిని మామిడి గుజ్జు, వెన్నతో కూడిన పెరుగుతో తయారు చేస్తారు. కొంచెం పంచదార, ఐస్‌ క్యూబ్‌ జత చేయడం ద్వారా జ్యూస్‌ మరింత రుచి, చల్లదనం యాడ్‌ అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచింది. మ్యాంగో లస్సీ తాగడం ద్వారా శరీరాన్ని వెంటనే చల్లబరుచుకోవచ్చు. 

    4. నంగు షర్బత్

    సమ్మర్‌ స్పెషల్‌ డ్రింక్స్‌లో నంగు షర్బత్ ఒకటి. దీనిని తాటి ముంజులతో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. చక్కెర, నీళ్లు వంటి సాధారణ పదార్థాలతోనే దీనిని తయారు చేస్తారు. కానీ చాలా మంది దీనిలో మామిడి పండ్లు, పాలను కలిపి తయారుచేస్తారు. ఈ జ్యూస్‌ మహారాష్ట్రలో టార్గోలా, బంగాల్‌లో తాల్ ,తమిళనాడులో నోంగు వంటి పేర్లతో ఫేమస్‌ అయింది. ఈ జ్యూస్‌ వేసవిలో మాత్రమే దొరుకుతుంది. 

    5. బార్లీ నీళ్లు

    వేవవిలో అన్నింటికంటే అద్భుతమైంది బార్లీ నీళ్లు. బార్లీ అనాదిగా వినియోగిస్తున్న అద్భుతమైన ధాన్యం. బార్లీ కాచుకుని తాగితే చాలా మంచి ప్రయోజనాలున్నాయి. బార్లీ నీళ్లలో కొద్దిగా ఉప్పు, తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే ఇంకా మంచిది. శరీరంలోని ఉష్ణోగ్రతను బార్లీ త్వరగా తగ్గిస్తుంది. మిగతా జ్యూస్‌లతో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. 

    6. నిమ్మ-పుదీన జ్యూస్‌

    నిమ్మ – పుదీన జ్యూస్‌ను సమ్మర్‌లో తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ జ్యూస్‌ ఒక గ్లాసు తీసుకోవడం ద్వారా 6 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. అంతేకాకుండా దీనిలోని 40 గ్రా. సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాక ఎండవేడిమి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 

    7. మజ్జిగ

    ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు పెరుగు, కాస్త ఉప్పు కలిపి మజ్జిగను తయారు చేసుకుని తాగుతూ ఉంటే శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పేగులను కూడా మజ్జిగ ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో జీలకర్ర, ఉప్పు వేసి తయారు చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, అల్లంతో కూడా రకరకాల ఫ్లేవర్లలో మజ్జిగను తయారు చేసుకొని తాగొచ్చు.

    8. కొబ్బరి నీళ్లు

    ఎండాకాలంలో కొబ్బరినీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వేడిని కొబ్బరినీళ్లు త్వరగా తగ్గిస్తాయి. పైగా కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరే ఉంటుంది. కొవ్వు చాలా తక్కువగా ఉండి, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, 

    9. నారింజ / బత్తాయి జ్యూస్

    ఎండాకాలంలో నారింజ, లేదా బత్తాయి రసాన్ని తాగితే మంచిదని వైద్యులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ రెండు పండ్లలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. బత్తాయి లేదా నారింజలను వేసవికాలంలో తీసుకోవడం వల్ల వాటిలో ఉండే నీటి శాతం శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఇవి ఎండాకాలంలో శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి.

    10. కద్దూ కీ ఖీర్‌

    కద్దూ కీ ఖీర్‌.. ఇది హైదరాబాద్‌కు చెందిన స్పెషల్‌ మిల్క్‌ డెజర్ట్‌గా గుర్తింపు పొందింది. ఫంక్షన్లలో ఇది ఎంతో ఫేమస్‌ అని చెప్పొచ్చు. కోవా, పాలు, సొరకాయ లేదా గుమ్మడి కాయ ముక్కలతో దీన్ని తయారు చేస్తారు. చల్లగా ఉండే కద్దూ కీ ఖీర్‌ నోటికి ఎంతో రుచిగా ఉండటంతో పాటు.. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version