Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

    Sunscreens 2023: మీరు సన్‌స్క్రీన్స్‌ వాడటం లేదా? అయితే డేంజర్‌లో ఉన్నట్లే. టాప్‌-10 లోషన్స్‌ మీకోసం!

    September 20, 2023

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ అనగానే చాలా మంది దానిని బ్యూటీ ప్రొడక్ట్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. ఇది సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడే ఒక కీలకమైన రక్షణ విధానం. బీచ్‌లు, పర్వతారోహణలు, పగటి పూట ఎండలో చేసే రోజూవారి కార్యక్రమాల్లో సన్‌స్క్రీన్స్‌ను భాగం చేసుకోవాలి. వీటి వినియోగంలో ఏమాత్రం అలసత్వం వహించిన మీ చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకి సన్‌స్క్రీన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? మార్కెట్‌లో లభిస్తోన్న టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్ గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ ప్రయోజనాలు

    UV కిరణాల నుంచి రక్షణ

    సూర్యుడి నుంచి వెలువలడే అతినీలలోహిత కిరణాలు (UV) రెండు రకాలుగా భూమిని చేరతాయి. ఒకటి UVA కాగా, రెండోది UVB. UVA కిరణాలు మన చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. స్కిన్‌ను ముడతలు పడేలా చేసి త్వరగా వృద్ధాప్యచాయలు వచ్చేలా చేస్తాయి. ఇక UVB కిరణాలు వడదెబ్బకు కారణమవుతాయి. UVA, UVB కిరణాల నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ దోహదం చేస్తాయి. 

    చర్మ క్యాన్సర్‌ నివారణ

    అతినీలలోహిత కిరణాలు (UV) మీ చర్మంపై అతిగా పడితే అది స్కిన్‌ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదముంది. కాబట్టి బయటకు వెళ్లేముందు సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం మంచిది. UV కిరణాలు మన చర్మ కణాలను దెబ్బతీయకుండా సన్‌స్క్రీన్స్‌ అడ్డుగోడగా నిలబడతాయి. యూవీ రేడియేషన్స్‌ను నిరోధిస్తాయి. 

    వృద్దాప్యం దరిచేరదు

    అతినీలలోహిత కిరణాలు మన చర్మంలోని కొల్లజెన్‌, ఎలస్టిన్‌ ఫైబర్స్‌పై దాడి చేసి విచ్చిన్నం చేస్తాయి. చర్మాన్ని బలహీనపరిచి త్వరగా ముడతలు పడేలా చేస్తాయి. అయితే ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను వినియోగించడం ద్వారా ఈ ముప్పు నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. మన చర్మాన్ని ముడతల నుంచి కాపాడుకొని యవ్వనంగా ఉండవచ్చు. 

    నలుపు రంగు కట్టడి

    యూవీ కిరణాలు చర్మంలోని మెలనిన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా చర్మం కాంతిహీనంగా మారడంతో పాటు స్కిన్‌పై నల్ల మచ్చలు తలెత్తుతాయి. సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ వినియోగం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. తద్వారా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. 

    ఏడాది పొడవునా అవసరం

    సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ను సమ్మర్‌లో మాత్రమే వినియోగిస్తే సరిపోతుంది కదా అని చాలామంది భావిస్తుంటారు. అది సరైన ఆలోచన కాదు. వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సన్‌స్క్రీన్‌ వినియోగం అవసరం. సూర్యుడి నుంచే కాకుండా మంచు, నీరు నుంచి కూడా UV కిరణాలు విడుదలవుతాయి. కాబట్టి రోజూ సన్‌స్క్రీన్‌ రాసుకోవడం బెటర్‌. 

    సన్‌స్క్రీన్‌ కొనేముందు వీటిపై లుక్కేయండి

    SPF (సన్‌ ప్రొటక్షన్‌ ఫ్యాక్టర్‌)

    ఏదైనా సన్‌స్క్రీన్‌ లోషన్‌ కొనేముందు అందులోని SPF స్థాయుల్ని పరిశీలించాలి. SPF లెవెల్‌ ఎంత ఎక్కువగా ఉంటే ఆ లోషన్‌ UV కిరణాల నుంచి అంత సమర్థవంతంగా చర్మాన్ని కాపాడగలదు. అయితే 100% SPFను ఏ లోషన్స్‌ ఆఫర్‌ చేయడం చేయలేదు. రోజూ వారి వినియోగానికి 30 SPF బెటర్‌ అని చెప్పవచ్చు. అయితే SPF వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కవ సమయంలో ఔట్‌డోర్‌లో గడిపేందుకు వీలవుతుంది. 

    బ్రాడ్‌ స్పెక్ట్రం (Broad-Spectrum)

    సన్‌స్క్రీన్‌ లోషన్ తీసుకునేముందు అందులో బ్రాడ్‌ స్పెక్ట్రం (Broad-Spectrum) ఉందో లేదో పరిశీలించుకోవాలి. బ్రాడ్‌ స్పెక్ట్రం అనేది మన చర్మాన్ని UVA, UVB కిరణాల నుంచి రక్షిస్తుంది. 

    వాటర్‌ రెసిస్టెన్స్‌

    మీరు స్విమ్మర్‌ లేదా చెమట ఎక్కువ పట్టే చర్మాన్ని కలిగి ఉంటే వాటర్ రెసిస్టెన్స్‌ సన్‌స్క్రీన్స్‌ను వినియోగించాలి. దీని వల్ల చెమట లేదా తడి వల్ల సన్‌స్క్రీన్‌ క్రీమ్‌ తొలగిపోకుండా ఉంటుంది. 

    స్కిన్‌ టైప్‌

    మీ స్కిన్‌ గుణాన్ని బట్టి కూడా సన్‌స్క్రీన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మన స్కీన్‌ టైప్‌ను బట్టి మార్కెట్‌లో వివిధ రకాల లోషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. సెన్సిటివ్‌ స్కిన్‌, ఆయిల్‌ స్కిన్‌, డ్రై స్కిన్‌ కలిగిన వారి కోసం ప్రత్యేకించి లోషన్స్‌ లభిస్తున్నాయి. 

    మార్కెట్‌లోని టాప్‌-10 సన్‌స్క్రీన్‌ లోషన్స్‌

    Derma Co 1% Hyaluronic 

    మార్కెట్‌లో లభిస్తోన్న అత్యుత్తమమైన సన్‌స్క్రీన్స్‌లో  Derma Co 1% Hyaluronic ఒకటి. ఇది చర్మంపై పడే అతినీలలోహిత కిరణాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఎలాంటి స్కిన్‌ను కలిగిన వారైన దీన్ని వినియోగించవచ్చు. అమెజాన్‌లో రూ. 448 లకే ఈ లోషన్‌ అందుబాటులో ఉంది. 

    Dr. Sheth’s Ceramide & Vitamin

    ఇది SPF 50 లెవల్‌ను కలిగి ఉంది. ఇది చర్మం ముడతలను నివారిస్తుంది. ఎండ నుంచి మీ స్కిన్‌ను రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. భారతీయుల చర్మ గుణానికి అనుగుణంగా దీన్ని తయారు చేసింది. సున్నితమైన స్కిన్‌ కలిగినవారు కూడా దీన్ని వినియోగించవచ్చు. దీని ధర రూ.425.

    Foxtale Essentials Daily Glow 

    ఇది మీ చర్మాన్ని UV కిరణాలను రక్షించడమే కాకుండా మిల మిల మెరిసేలా చేస్తుంది. UVA, UVB కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్‌ – సీ కూడా పుష్కలంగా ఉంది. ఇందులో 50 SPF ఉంది. అమెజాన్‌లో రూ.244కే లభిస్తోంది.  

    Mamaearth Daily Glow

    మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మరో మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌ ‘Mamaearth Daily Glow’. ఇది మీ చర్మానికి రోజంతా రక్షణగా నిలుస్తుంది. అంతేగాక మీ చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. స్కిన్‌ టాన్‌ అవ్వకుండా కాపాడుతుంది. అమెజాన్‌ ఇది రూ.313లకు అందుబాటులో ఉంది. 

    Dot & Key Vitamin C + E Super Bright

    ఈ సన్‌స్క్రీన్‌ కూడా UVA/UVB & Blue Light కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. ఏలాంటి స్కిన్‌ కలిగిన వారికైన ఇది మంచి రిజల్ట్‌ను అందిస్తుంది. ఇందులో SPF 50తో పాటు విటమిన్‌ C, E కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని తళతళ మెరిసేలా చేస్తాయి. దీని ప్రైస్‌ అమెజాన్‌లో రూ.378గా ఉంది.

    Aqualogica Glow Sunscreen

    ఇది ఎండలో మీ చర్మం నల్లబడిపోకుండా చేస్తుంది. ప్రమాదకరమైన సూర్య కిరణాలు మీ చర్మాన్ని డ్యామేజ్‌ చేయకుండా అడ్డుగా నిలుస్తుంది. దీని అసలు ధర రూ.399 కాగా, అమెజాన్‌ దీనిపై 12% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా దీన్ని రూ.350కే పొందవచ్చు.

    Minimalist Sunscreen 

    రూ.500 లోపు మంచి సన్‌స్క్రీన్‌ కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. 50 Sun Protection Factorను కలిగి ఉంది. ఇది 50గ్రాముల బరువు ఉంది. Minimalist Sunscreen ధర అమెజాన్‌లో రూ. 399గా ఉంది. 

    Neutrogena Ultra sheer 

    ఈ సన్‌స్క్రీన్‌ కూడా అతినీలలోహిత కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అంతేగాక మీ స్కిన్‌ మృదువుగా, తాజాగా ఉండేలా చేస్తుంది. ఇది SPF 50+ను కలిగి ఉంది. రూ.200 లోపున్న సన్‌స్క్రీన్‌ను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. అమెజాన్‌లో ఈ లోషన్‌ రూ.195కే లభిస్తోంది. 

    Re’equil Ultra Matte Dry Touch 

    మార్కెట్‌లో లభిస్తోన్న అద్భుతమైన సన్‌స్క్రీన్స్‌లో ఇది కూడా ఒకటి. ఇది Broad spectrum ప్రొటెక్షన్‌తో పాటు 50 Sun Protection Factorను కలిగి ఉంది. ఎటువంటి చర్మాన్ని కలిగి ఉన్నా దీన్ని వినియోగించవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.624 లభిస్తోంది.

    Lotus Herbals Safe Sun Invisible Matte

    సహజసిద్ధమైన ఆయుర్వేదిక్‌ సన్‌స్క్రీన్‌ కోసం వెతికే వారు ‘Lotus Herbals Safe Sun Invisible Matte’ ట్రై చేయవచ్చు. ఇందులో 50 Sun Protection Factor, బోర్డ్‌ స్పెక్ట్రం కూడా ఉంది. ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ లోషన్‌ను వాడవచ్చు. అమెజాన్‌లో రూ.349లకే ఇది లభిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version