తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss Telugu) సీజన్-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అనంతరం సోహెల్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
‘నా సినిమాకు వెళ్లండన్నా’
‘బూట్‌కట్ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే!
బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్ సాబ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్ (Sohel) డిమాండ్ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్టార్ హీరో పవన్ కల్యాణ్ సినిమాలకే కంటెంట్ ఉన్న ఆడియన్స్ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్ ప్రెస్ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నటుడు సోహెల్ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.
ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు.
తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.
సోహెల్ ఫ్రస్టేషన్‌కు కారణమిదే!
బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్ అల్లుడు’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’ సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు.