Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్! 

    Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్‌ సేన్‌.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్! 

    July 3, 2024

    యంగ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్‌, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. విశ్వక్‌.. ఇటీవలే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) సినిమాతో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్నాడు. దీంతో అతడు నెక్స్ట్‌ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నాడో అని ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. అయితే తాజాగా ఈ యంగ్‌ హీరో.. తన కొత్త సినిమాను మెుదలు పెట్టారు. ఈ మూవీలో విశ్వక్‌ పాత్రకు సంబంధించి ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ కాగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ చేయని గెటప్‌లో విశ్వక్‌ ఈ పోస్టర్‌లో కనిపించాడు. 

    ‘లైలా’గా విశ్వక్‌ సేన్‌..

    ప్రస్తుతం విష్వక్‌ సేన్‌.. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్‌ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘లైలా’ (Laila Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం జరగ్గా.. ఫస్ట్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ లేడీ గెటప్‌లో కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్లోజ్‌గా ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్‌ను రిలీజ్ చేసారు. కెరీర్‌లో తొలిసారి ఓ లేడీ గెటప్‌లో విశ్వక్‌ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. అమ్మాయిగా విశ్వక్ సేన్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. హీరోయిన్లను తలదన్నే అందంతో కనిపించి సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాడని పోస్టులు పెడుతున్నారు. తమ హీరో డేరింగ్‌ డెసిషన్‌కు సెల్యూట్‌ అంటూ పోస్టర్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఈ మూవీ కూడా తప్పక విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. 

    రిలీజ్ ఎప్పుడంటే..!

    తాజాగా పూజా కార్యక్రమం జరుపుకున్న ‘లైలా’ చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)నటించనుంది. ఈ మూవీని వచ్చే ఏడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న (Laila Movie Release Date Announced) రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణాన్ని కూడా ఫైనల్‌ చేసి.. షూటింగ్‌ మెుదలు పెట్టేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు మెుదలు పెట్టింది. ఈ మూవీ విశ్వక్‌ కెరీర్‌లోనే మరుపురాని చిత్రంగా మిగిలిపోతుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. 

    ‘రెమో’ తరహాలో మేకోవర్‌!

    విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్‌ ‘లైలా’ పోస్టర్‌.. తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) నటించిన ‘రెమో’ (Remo) చిత్రాన్ని గుర్తు చేస్తోంది. బక్కియారాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా చేసింది. ఇందులో కూడా హీరో శివకార్తికేయన్‌.. అందమైన అమ్మాయి గెటప్‌లో కనిపిస్తాడు. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసే క్రమంలో సినిమా మెుత్తం ఆ పాత్రలోనే అలరిస్తాడు. అయితే విశ్వక్‌ సేన్‌ కూడా లైలాలో ఎక్కువ నిడివి లేడీ గెటప్‌లోనే కనిపించే అవకాశముందని అంటున్నారు. లైలా పోస్టర్‌లోని అతడి మేకోవర్‌ చూస్తే.. ఏదో ఒక సీన్‌ కోసం చేసినట్లు కనిపించడం లేదు. అచ్చమైన అమ్మాయిలాగా కనిపించేలా అతడి మేకోవర్‌ను డిజైన్‌ చేసినట్లు అనిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

    ‘మెకానిక్‌ రాకీ’గా విశ్వక్‌..

    ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌.. ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky) అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీలో విశ్వక్‌ పాత్ర.. చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో రానున్న చిత్రంలో.. విశ్వక్‌కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) కనిపించనుంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కేరీర్‌లో 10వ మూవీగా రానుంది. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version