Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!

    Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!

    July 1, 2024

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27) విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కల్కి సినిమా చూసి అదిరిపోయిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక తొలిరోజు రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిందోనని యావత్‌ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించిన వీకెండ్ కలెక్షన్స్ అంకెలు మతిపోగొడుతున్నాయి. హీరో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ స్టామినాకు అద్దం పడుతున్నాయి. 

    వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే?

    ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. వీకెండ్‌లో (గురు, శుక్ర, శని, ఆదివారాలు) వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన కల్కి.. తొలి నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్‌ సాధించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కల్కి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ను కల్కి రికవరి చేయడం విశేషం. కాగా, మరోవారం రోజులపాటు కొత్త సినిమాలు ఏవి విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కి కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వసూలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    ‘కల్కి’ కొత్త చరిత్ర

    ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికా ఆడియన్స్‌ కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా అక్కడ కల్కి కొత్త చరిత్రను సృష్టించింది. నార్త్‌ అమెరికాలో మెుదటి వారంతంలో 11 మిలియన్‌ డాలర్ల వసూళ్లను ‘కల్కి 2898 ఏడీ’ రాబట్టింది. ఒక ఇండియన్‌ సినిమా.. వీకెండ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం నార్త్‌ అమెరికాలో ఇదే తొలిసారి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.91 కోట్లకు సమానం. ఏడేళ్లుగా నార్త్ అమెరికాలో పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్‌ను ‘కల్కి’ తొలి నాలుగు రోజుల్లోనే చెరిపేయడం విశేషం. ప్రస్తుత అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే రానున్న రోజుల్లో కల్కి మరిన్ని రికార్డులను నార్త్‌ అమెరికాలో క్రియేట్‌ చేస్తుందని చెప్పవచ్చు. 

    నార్త్‌లో కల్కి ప్రభంజనం

    ప్రభాస్‌ కల్కి చిత్రం.. నార్త్‌ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూసేందుకు విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా హిందీ భాషలో కల్కి తొలి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.115 కోట్లకు (GROSS) పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ కలిపి) వీకెండ్‌లో రూ.171.15 కోట్లను ప్రభాస్‌ చిత్రం వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ.19.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. కల్కి బాక్సాఫీస్‌ సునామి మరిన్ని రోజులు కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version