Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!

    Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!

    June 29, 2024

    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా హోస్‌ఫుల్‌ బోర్డులతో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో రెండో రోజు కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

    డే 2 కలెక్షన్స్ ఎంతంటే?

    ‘కల్కి 2898 ఏడీ’ రెండో రోజు వసూళ్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.191.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మేకర్స్‌ లెక్కల ప్రకారం.. కల్కి వరుసగా రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కల్కి ఖాతాలో మరో రూ.107 కోట్లు (GROSS) వచ్చి చేరాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కలెక్షన్స్‌లో 80% మేర కోత పడింది. దీంతో తొలి రెండు రోజుల్లో ఈజీగా రూ.350 కోట్ల మార్క్‌ దాటుతుందనుకున్న కల్కి.. కనీసం రూ.300 కోట్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

    తొలి రోజు ఆల్‌టైమ్‌ రికార్డు

    ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. తొలి రోజున నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి.

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డ్‌ సేఫ్‌!

    ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ రికార్డును ‘కల్కి 2898 ఏడీ’ బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత ‘బాహుబలి 2’ రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది. 

    కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్!

    ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం (జూన్‌ 27) సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్‌గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఇవాళ (జూన్‌ 29) వరల్డ్‌ కప్ ఫైనల్ ఉండటంతో కల్కి మూడో రోజు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version