• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ అరెస్ట్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆయనను మంగళవారం పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. భారీ సంఖ్యలో వచ్చిన పాక్ రేంజర్లు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ తరఫు న్యాయవాదులపై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇమ్రాన్ అరెస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Rangers abducted PTI Chairman Imran Khan, these are the visuals. Pakistan’s brave people must come … Read more

    ఫెర్ఫ్యూమ్ బాంబు; ఉగ్రవాదిగా మారిన టీచర్

    జమ్ముకశ్మీర్‌లో వైష్ణోదేవి యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద [ఫెర్ఫ్యూమ్ బాంబు](url)ను స్వాధీనం చేసుకున్నారు. ఆరిఫ్ 12 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం మరో ఉగ్రవాది, తన మేనమామ అయిన ఖాసిమ్‌తో కలసి ఉగ్రదాడులకు తెగబడుతున్నాడు. వీరిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. కాగా సెంట్ బాటిల్‌లో అమర్చిన ఐఈడీ స్ప్రే బటన్ నొక్కగానే బ్లాస్ట్ అవుతుంది. A https://t.co/U3YwRLGJPk teacher turned LeT terrorist was … Read more

    నడిరోడ్డుపై స్టెప్పులు.. లాకప్‌లో దెబ్బలు

    ఓవర్‌నైట్ సెలబ్రిటీలుగా మారడానికి కొంతమంది ఏదైనా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ డ్యాన్స్‌లు చేస్తున్నారు. తాజాగా ఘజియాబాద్‌లో ఇద్దరు అమ్మాయిలు, ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఇది కాస్తా పోలీసులకు చేరింది. ఇంకేముంది వారిని వెతికి పట్టుకుని మరీ ఆ యువకుడిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు. కాగా యువతులను అరెస్ట్ చేయకపోవడంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. @myogiadityanath @CMOfficeUP सर, इस वीडियो वायरल हुआ, जिसमे 2 … Read more

    ముంబైలో తాగుబోతు రచ్చ

    ముంబైలో ఓ తాగుబోతు.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. షకీల్ ఆహియా అనే వ్యక్తి ఉదయాన్నే తాగి ముంబైలోని నానా చౌక్ స్కైవాక్ రూఫ్ మీదకి ఎక్కి హంగామా సృష్టించాడు. అతడిని స్కైవాక్ నుంచి కిందకి దించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రెండు గంటల శ్రమ అనంతరం అతడిని కిందకి దించారు. అతడు కిందపడిపోతే ప్రమాదం జరగకుండా కొందరు యువకులు కింద నెట్ పట్టుకుని తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. #Mumbai skywalk पर … Read more