• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు పిటిషన్ వాయిదా

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.

    చంద్రబాబుకు పిటిషన్ డిస్మిస్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది.

    చంద్రబాబుపై సింపతి పెరిగింది: మురళీమోహన్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం బాధను కలిగిస్తోందని నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదన్నారు. అవినీతి మచ్చలేకుండా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో ఆయనపై సింపతి పెరిగిందన్నారు. ఎచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మురళీమోహన్ అన్నారు..

    పవన్- చంద్రబాబు పొత్తుపై సెటైర్లు

    పనవ్- చంద్రబాబు పొత్తుపై సీఎం జగ్ సెటైర్లు విసిరారు. ‘చంద్రబాబును చూస్తే గుర్తుకొచ్చేవి.. మోసాలు వెన్నుపోట్లు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైళ్లో ఉన్నా ఒకటే. చంద్రబాబు మోసాల్లో పవన్ భాగస్వామి. పవన్ పార్టీ పెట్టి 15 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటివరకు కనీసం గ్రామాల్లో ఆ పార్టీ జెండా మోసే కార్యకర్తే లేడు. పవన్ జీవితమంతా చంద్రబాబు భజన చేయడానికే సరిపోతుంది’ అంటూ ఎద్దేవా చేశారు.

    చంద్రబాబు పిటిషన్‌ వాదనలు వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టులో వాదించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో స్కిల్ స్కాం 2018లో జరిగిందని ఎక్కడా లేదన్నారు. 17ఏ ఈ కేసులో కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్ననికి వాయిదా వేసింది. లంచ్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసు ఐటెం నంబర్ 59గా లిస్టైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సేక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్‌ చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లాయర్లు వాదిస్తున్నారు.

    చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

    చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమం చెప్పట్టారు ‘కాంతితో క్రాంతి’ పేరుతో టీడీపీ నిరసన చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేష్, హైదరాబాద్‌లో బ్రాహ్మణి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    సిల్క్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.