• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత

  పల్నాడు- చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేశారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు రోడ్లపైకి పెద్ద పెద్ద టైర్లను మోహరించి నిప్పు పెట్టారు. దీంతో చిలుకలూరిపేట- విజయవాడ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున బయటకు వచ్చిన ప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు.. #WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023 pic.twitter.com/SmyPYcJIF0 — iTDP Official (@iTDP_Official) September … Read more

  చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు

  చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన తరఫు లాయర్లు స్పందించారు. ‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. హైబీపీ, షూగర్ ఉంది. బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించాం. కేసుతో సంబంధం లేని సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేశారు. న్యాయపోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ??? ????????-Former Andhrapradesh CM Chandrababu Naidu arrested in the Skill development case. #Chandrababunaidu#G20India #tdp #CBN #TDPAndrapradesh … Read more

  పవన్‌ ఓ పిచ్చికుక్క: మంత్రి

  AP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మరోమారు విరుచుకుపడ్డారు. పవన్‌ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడని దుయ్యబట్టారు. వెంకటపాలెం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి.. పవన్‌ ఓ పిచ్చికుక్క అని విమర్శించారు. చంద్రబాబు ముసలి నక్క అని ఫైరయ్యారు. అటు నారా లోకేష్‌ ఊరపంది తిరిగినట్లు రోడ్లపై తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఎవరూ టచ్‌ చేయలేరని, మా వెంట్రుక కూడా పీకలేరని జోగి రమేశ్‌ అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి కుక్క, చంద్రబాబు … Read more

  ఇది ప్రజావిజయం, మార్పునకు సంకేతం: చంద్రబాబు

  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

  జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు తొక్కేశారు; కొడాలి నాని

  [వీడియో;](url) జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొక్కేశారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోకేశ్ భవిష్యత్ కోసం ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలోకి రానివ్వడం లేదని ఆరోపించారు. అవసరమైనప్పుడు ప్రచారం చేయించుకుని.. ఆ తర్వాత కూరలో కరివేపాకులా పక్కన పడేస్తారని మండిపడ్డారు. తాతా మనవళ్లను ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అవమానాలన్నీ జూ.ఎన్టీఆర్‌కు తెలుసని.. కానీ బయటికి చెప్పరని పేర్కొన్నారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడు: కొడాలి … Read more

  భోగి వేడుకల్లో చంద్రబాబు, బాలయ్య

  సొంతఊరు నారావారిపల్లెలో భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు భోగి మంటల్లో పాలుపంచుకున్నారు. తెలుగురాష్ట్రాల ప్రజలకు బాలయ్య భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో నారవారిపల్లే ప్రజలతో పాటు తిరుపతి జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు

  చంద్రబాబు నాయుడు నరహంతకుడు: ఆర్జీవీ

  కందుకూరు ఘటనలో చంద్రబాబు వల్లే 8 మంది చనిపోయారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విమర్శించారు. జనం ఎక్కువగా కనిపించాలి, పాపులారిటీ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు చిన్న స్థలంలో సభ ఏర్పాటు చేశారని ఆర్జీవీ ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే జనాల ప్రాణాలు తాకట్టుపెట్టారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

  కుప్పంలో రెండో రోజు బాబు పర్యటన; ఏం జరుగుతుందో?

  టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. పర్యటన తొలి రోజు పోలీసుల నుంచి అడుగడుగునా [ఆంక్షలు](url) ఎదుర్కొన్నారు. నేడు ఆయన నియోజకవర్గంలో ఎలా, ఎక్కడ పర్యటిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు ఈ రోజు మొత్తం పార్టీ కేడర్‌తో భేటీకి కేటాయించారు. బూత్‌ల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాగా చంద్రబాబుకు సంబంధించిన ప్రచార రథాన్ని కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. Police deny permission for #ChandrababuNaidu#Chandrababu angrily questioned, "I am the … Read more

  చంద్రబాబు సభలో విషాదం; 8 మంది మృతి

  ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు బహిరంగ సభలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 8 మంది దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా [తోపులాట](url) జరిగి ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతో మరో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులకు తలో రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. Breaking?JUST IN: Seven persons have … Read more