కందుకూరు ఘటనలో చంద్రబాబు వల్లే 8 మంది చనిపోయారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విమర్శించారు. జనం ఎక్కువగా కనిపించాలి, పాపులారిటీ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు చిన్న స్థలంలో సభ ఏర్పాటు చేశారని ఆర్జీవీ ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే జనాల ప్రాణాలు తాకట్టుపెట్టారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.