• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రాజమౌళిపై ఆర్జీవీ ప్రశంసల వర్షం

  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఒక భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఏ దర్శకుడూ అనుకోలేదని పేర్కొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవల పోస్ట్ చేసిన ఓ [వీడియో](url)ను వర్మ రీట్వీట్ చేశారు. కాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి.. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో ముచ్చటించిన వీడియోపై వర్మ కామెంట్స్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. "If you ever wanna make a movie over here, let's talk"- … Read more

  చంద్రబాబు నాయుడు నరహంతకుడు: ఆర్జీవీ

  కందుకూరు ఘటనలో చంద్రబాబు వల్లే 8 మంది చనిపోయారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విమర్శించారు. జనం ఎక్కువగా కనిపించాలి, పాపులారిటీ రావాలనే ఉద్దేశంతో చంద్రబాబు చిన్న స్థలంలో సభ ఏర్పాటు చేశారని ఆర్జీవీ ఆరోపించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఎలాంటి ప్రదేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసమే జనాల ప్రాణాలు తాకట్టుపెట్టారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

  జగన్‌ను RGV కలిసింది అందుకే!

  అక్టోబర్‌లో సీఎం జగన్‌తో సంచలన దర్శకుడు ఆర్జీవీ భేటీపై క్లారిటీ వచ్చింది. అప్పుడు జగన్‌ను కలిసిన తర్వాత వర్మ ఎలాంటి జవాబు చెప్పలేదు. దీంతో అప్పట్లో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆ భేటీ ‘వ్యూహం’ అనే సినిమాకు సంబంధించినదని తెలుస్తోంది. జనవరి 26న ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతోందని సమాచారం. అయితే ఈ సినిమా కథాంశమేంటనేది ఇంకా తెలియలేదు.

  అవతార్‌ను సినిమా అంటే నేరం: RGV

  జేమ్స్‌ కేమరూన్‌ విజువల్‌ వండర్ అవతార్‌-2పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇప్పుడే అవతార్2లో స్నానం చేసి వచ్చా. దీనిని సినిమా అనడం నేరం. ఎందుకంటే అత్యద్భుతమైన విజువల్స్‌తో, అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో జీవితకాలానికి సరిపడా అనుభూతిని అందించింది అవతార్‌. మరోలోకంలో విహరించినట్లు ఉంది’ అని సినిమాపై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.

  ఆర్జీవీ నా బాడీ మొత్తం చూసేశారు; యాంకర్ సాయిదివ్య

  ఆర్జీవీతో ఇంటర్వ్యూ తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చేసింది యాంకర్ సాయిదివ్య. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆర్జీవీ గురించి సాయిదివ్య మాట్లాడుతూ..‘‘ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆర్జీవీ నా బాడీ ఎక్కడ ఎలా ఉందో మొత్తం చూశారు. తర్వాత నన్ను జిమ్‌కు వెళ్లి బాడీ ఫిట్‌గా ఉండేటట్లు చూసుకొమ్మన్నారు. వాయిస్, హెయిర్, బాడీ, ఫేస్ సరిచేసుకుంటే యాంకర్‌గా మంచి కెరీర్ ఉంటుందని చెప్పాడు.’’ అంటూ ఈ బోల్డ్ యాంకర్ వర్మపై ప్రశంసలు కురిపించింది.

  దసరాకు ‘అడవి’ సినిమా రీ రిలీజ్‌

  టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న వేళ ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా ఓ సినిమా రీ రిలీజ్‌ చేయబోతున్నాడు. అయితే అదేదో తన సూపర్‌ హిట్‌ సినిమా అయిన ‘శివ’ కాదు. అత్యంత చెత్త సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నాడు. నితిన్‌, నిషా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కి 2009లో విడుదలైన ‘అడవి’ సినిమాను అక్టోబర్‌ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం అప్పట్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్‌ కెరీర్‌లో జీరో షేర్లతో ముగిసిన ఏకైక సినిమా ఇది. దీనిని ఆర్జీవీ … Read more

  3 మూవీ రీరిలీజ్ పై ఆర్జీవీ ట్వీట్

  ధనుష్ శృతి హాసన్ జంటగా నటించిన త్రీ మూవీని నేడు థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలలోని థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. రాబోయే రెండు మూడు షోలకు కూడా మంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతాలకే మహాద్భుతం అని ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరీ’ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

  అప్సర రాణి హాట్ పోజ్ వైరల్

  RGV ఆస్థాన హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అప్సర రాణి తన తాజా ఫొటోను షేర్ చేసింది. చైర్లో హాట్ పొజ్‌లో కుర్చున్న అప్సర.. చేతిలో గ్లాస్ పట్టుకుని ఫొటో దిగింది. ఈ ఫొటోను డైరెక్టర్ ఆర్జీవీ క్లిక్ చేశారని అప్సర చెప్పుకొచ్చింది. అయితే దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ.. ఫొటోగ్రఫి మాత్రమే కాదు, ఆమె కూర్చున్న కుర్చి కూడా నాదేనంటూ రిప్లై ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చిన స్టైల్‌లో వారు కామెంట్లు కురిపిస్తున్నారు.

  లడ్కీ మూవీ నిర్మాతపై RGV ఫిర్యాదు

  లడ్కీ మూవీ నిర్మాత శేఖర్ రాజు పై డైరెక్టర్ ఆర్జీవీ హైదరాబాద్- పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కావాలనే కుట్ర చేసి సినిమా విడుదల నిలిపివేశారని ఆర్జీవీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో సినిమా కోసం తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆర్జీవీ తిరిగి ఇవ్వలేదని శేఖర్ రాజు కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారించిన సిటీ కోర్టు అన్ని భాషల్లో లడ్కీ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో లడ్కీ మూవీ విడుదల వాయిదా పడింది.

  మగవాళ్లు ఎక్కడున్నా మగవాళ్లే: RGV

  లడ్కీ మూవీ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు క్యూ కడుతున్నట్ల డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఎక్కువగా పురుషులే ఈ సినిమాకు వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. “మగవాళ్లు ఎక్కడ ఉన్న మగవాళ్లే” అనే ట్యాగ్ ను సార్థకం చేస్తున్నారని వివరించాడు. ఈ మేరకు థియేటర్ల ముందు క్యూకట్టిన ప్రేక్షకుల ఫొటోలను ఫోస్ట్ చేశాడు. Courtesy Twitter: Courtesy Twitter: