• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

    అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ వాయిదా పడింది. నేడు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించగా శుక్రవారం సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

    చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

    స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసినబెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల 15కి వాయిదా చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. విచారణకు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ కోర్టుకు తెలిపింది. తమకు తగిన సమయం కావాలని కోరింది. దీంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చిచెప్పింది.

    నేడు చంద్రబాబు బెయిలు పిటిషన్‌ విచారణ

    స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో 37వ నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలి. ఇదే కేసులో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు బెయిలు పొందిన వారిలో ఉన్నారు.

    ‘నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం’

    సీఎం జగన్‌పై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే జగన్‌ నైజమని విమర్శించింది. ‘ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. ఇది చేయడం చేస్తే జగన్‌లో ఓటమి భయం పట్టుకుందని టీడీపీ విమర్శించింది.

    వన్డే ఐసీసీ ర్యాంకులు విడుదల

    ICC వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ రెండో స్థానానికి దిగజారాడు. శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లు రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శ్రేయస్‌ అయ్యర్ 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు.

    చంద్రబాబు బెయిల్‌పై విచారణ వాయిదా

    IRR కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ నిర్ణయం వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

    చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌

    చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కూడా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాజాగా మళ్లీ క్యాటరాక్ట్‌ చికిత్స కోసం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి వచ్చారు.

    మరోసారి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.. వైద్య నిపుణుల సూచన మేరకు ఏఐజీ ఆస్పత్రిలో అవసరమైన పరీక్షలు చేయించుకోనున్నారు. శనివారం ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకున్నారు.

    చంద్రబాబుతో పవన్‌ కీలక భేటి

    HYD: తెదేపా అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌ కల్యాణ్ హైదరాబాద్‌లో కలిశారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీకి సంబంధించి 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై నేతలు చర్చించారు.