• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబును పరామర్శించిన పవన్‌

    టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

    ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి కానున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేయనున్నారు. ఏఐజీ నుంచి ఆయన నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లనున్నారు. చంద్రబాబు కంటి సమస్యకు వైద్యులు శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. చంద్రబాబు వైద్య పరీక్షల కోసం నిన్న ఏఐజీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే..

    చంద్రబాబు కేసులో కీలక మలుపు

    AP: చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12 మంది ఐఏఎస్‌లను విచారించాలంటూ న్యాయవాది ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెదేపా హయాంలో సిమెన్స్‌ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఆయన ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదులో సూచించారు.

    ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు

    HYD: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. ఈ ఉదయమే వైద్య పరీక్షల కోసం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం చంద్రబాబు అక్కడే అడ్మిట్‌ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయన వైద్యుల సంరక్షణలో ఒకరోజు పాటు ఉండే అవకాశం ఉంది.

    చంద్రబాబుపై సీఐడీ మరోకేసు

    చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదుచేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఎపీఎండీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా, మాజీ మంత్రి పీతల సుజాతను ఏ1గా, చింతమనేని ప్రభాకర్‌ను ఏ3గా, దేవినేని ఉమాను ఏ4 నిందితులుగా చేర్చింది. వీరు టీడీపీ హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేశారని సీఐడీ ఫిర్యాదులో పేర్కొంది.

    ఏఐజీ ఆస్ఫత్రిలో చంద్రబాబు

    టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నిన్న జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఏఐజీ వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచన మేరకు చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

    ఢిల్లీకి వెళ్లిన లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో కేసులపై చర్చించనున్నారు. కేసుల విషయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తారు. చంద్రబాబు క్యాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.. మరోపైపు ఏపీ ప్రభుత్వం లోకేష్‌పై పలు కేసులు మోపుతోంది. .

    మీ అభిమానం మర్చిపోలేనిది: చంద్రబాబు

    రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడారు. కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారని గుర్తుచేసుకున్నారు. సంఘీభావం తెలపడమే కాకుండా తాను చేసిన అభివృద్ధిని కూడా వివరించారని కొనియాడారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రపంచంలోని తెలుగువారందరికీ పేరు పేరునా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

    జైలు నుంచి చంద్రబాబు విడుదల

    రాజమహేంద్రవరం జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు విడుదలతో టీడీటీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

    సింపతీ కోసం చంద్రబాబు ప్లాన్: సజ్జల

    టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ మంజూరుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు వచ్చారని తెలిపారు. ప్రజల్లో సింపతీ కోసమే చంద్రబాబు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. చంద్రబాబు బయట ఉన్నా లోపల ఉన్నా పెద్ద తేడా లేదన్నారు.హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.