• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు బెయిల్‌ షరతులు ఇవే!

    AP: స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ కాపీలో హైకోర్టు పలు షరతులు విధించింది. ‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది’ అని తీర్పు కాపీలో జస్టిస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

    చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు

    AP: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు నాలుగు వారాల బెయిల్‌ మంజూరు ‌అయ్యింది. ఆయన వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు ఆమోదించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్‌ 24 వరకూ మధ్యంతర బెయిల్ వర్తించనున్నట్లు అందులో పేర్కొన్నారు. తిరిగి నవంబర్ 28న సరెండర్ అవ్వాలని చంద్రబాబును కోర్టు ఆదేశించింది. మరోవైపు ప్రధాన బెయిల్‌ పిటిషన్‌పై నవంబర్‌ 10న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

    AP: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్‌కు సంబంధించి నిన్న (సోమవారం) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా, చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు పెట్టింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది.

    టీటీడీపీకి కాసాని రాజీనామా

    తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయకపోవడంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాల్సిందేనని కొందరు నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే కాసాని భావోద్వేగానికి గురయ్యారు.

    చంద్రబాబుపై మరో కేసు

    టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ కాపీ అందజేశారు.

    చంద్రబాబు బెయిల్ పిటిషన్ రిజర్వ్

    చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 50 రోజులకు పైగా చంద్రబాబు జైలులో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో తమ వాదలు వినిపించేందుకు తగిన సమయం కావాలని సీఐడీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

    పవన్‌ చంద్రబాబుకు పనివాడు: అంబటి

    AP: చంద్రబాబు జైలులో శత దినోత్సవాలు జరుపుకొంటారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన జైలుకెళ్లి 50 రోజులు దాటిన నేపథ్యంలో అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పులే ఆయన్ను జైలుకు వెళ్లేలా చేశాయని మంత్రి అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్‌కు అండగా ఉన్న తనపై దాడులు చేస్తున్నారన్నారు. ఓ సామాజికవర్గం వారే తనపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. అటు పవన్‌ మనవాడు కాదని చంద్రబాబు దగ్గర పనివాడని అంబటి ధ్వజమెత్తారు.

    తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో ములాఖత్‌లో చెప్పారు. ఏపీలో ప్రస్తుత రాజకీ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫొకస్ పెట్టలేమని తెలిపారు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నమో టీడీపీ కార్యకర్తలకు వివరించాలని ఆయన సూచించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తప్పుకున్నట్లైంది.

    చంద్రబాబుకు కంటి సమస్య

    రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుకు కంటి సమస్య ఉందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. సివిల్ సర్జన్ బీ.శ్రీనివాసరావు చంద్రబాబును టెస్ట్ చేసి దృష్టి సమస్య ఉందని స్పష్టం చేశారు. కుడి కంటిలో క్యాటారాక్ట్ ఉందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వెంటనే శస్త్ర చికిత్స చేయకుంటే కుడి, ఎడమ కంటి చూపుల్లో తేడా ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు.

    చంద్రబాబును చంపేస్తామంటున్నారు: నారా లోకేష్

    జైలులో ఉన్న చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ‘ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్ష్యతోనే ఆయనను అరెస్టు చేశారు. కేసులతో సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారు. ఒక్క ఆధారం కూడా ప్రజల ముందుకు తీసుకురాలేక పోయారు. మా ఆస్తుల వివరాలు ఐటీ రిటర్న్‌లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం’. అని లోకేష్ పేర్కొన్నారు.