• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అలా జరిగితే చంద్రబాబు చావు ఖాయం’

    వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ సీఎం అయితే చంద్రబాబు చావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మళ్లీ వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌పై ఎన్ని పోరాటాలు చేసినా లాభం లేదని మాధవ్ పేర్కొన్నారు.

    టీడీపీ, జనసేన విజయం ఖాయం: భువనేశ్వరి

    2024లో టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘దివంగత నేత ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం తీసుకొస్తే.. చంద్రబాబు వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. అలాంటి వ్యక్తిని 49 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయన చేసిన నేరం ఏమిటో ఆధారాలు ,చూపించండి’. అని భువనేశ్వరి ప్రశ్నించారు.

    నా హత్యకు కుట్ర జరుగుతోంది: CBN

    AP: ఏసీబీ కోర్టు జడ్జికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ‘కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది. దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్‌ రిలీజ్‌ చేశారు. నా భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు ఉన్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను చంద్రబాబు రాశారు.

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

    AP: నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్‌ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ విచారణ చేపట్టనుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది.

    చంద్రబాబును కేసుల్లో ఇరికించారు: భువనేశ్వరి

    చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి 48 రోజులుగా జైల్లో పెట్టారని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. చంద్రబాబును జైల్లో ఉంచినా ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయలేరని తెలిపారు. తిరుపతిలో ‘నిజం గెలవాలి కార్యక్రమం’లో భువనేశ్వరి మాట్లాడారు. అనంతపురానికి చంద్రబాబు కియా మోటార్స్‌, తిరుపతికి ఫాక్స్‌కాన్‌ కంపెనీలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని భువనేశ్వరి ఆరోపించారు.

    89 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల వారిగా టికెట్ ఆశిస్తున్న వారిని ఎంపిక చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జైలులో ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలకు 189 మంది పేర్లతో జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.

    హైకోర్టులో CBN అత్యవసర పిటిషన్

    AP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ జరపాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో వివరించారు. కాగా, చంద్రబాబు కంటికి అత్యవసర చికిత్స అవసరమని కంటి వైద్యులు సూచించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

    ‘చంద్రబాబు కంటికి చికిత్స అవసరం’

    AP: చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని ఆయన్ను పరిశీలించిన కంటి వైద్యులు నివేదిక ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. అయితే చంద్రబాబు కంటికి ఇప్పట్లో ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బుధవారం విడుదల చేసిన చంద్రబాబు హెల్త్‌ బులెటిన్‌లోనూ కంటిసమస్యను ప్రస్తావించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నాలుగు నెలల క్రితం చంద్రబాబు కంటికి కేటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది.

    ఆ రోజే చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అక్టోబరు 27న ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించి.. విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై మోపిన స్కిల్‌, రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసులో ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డి పనిచేశారని చెప్పారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భంధించారని భువనేశ్వరి అన్నారు.