• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజాధనంపై మాకు ఆశలేదు: భువనేశ్వరి

    AP: తన తండ్రి, భర్త ఇద్దరూ సీఎంలుగా చేసినా తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని చంద్రబాబు భార్య భువనేశ్వరి అన్నారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారని ఆమె గుర్తుచేశారు. తన ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు జీవించాలని ప్రార్థించారు. ప్రజాధనంపై తమకు ఎప్పూడు ఆశలేదని, మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదని భువనేశ్వరి పునరుద్ఘటించారు. నా ఆయుషు కూడా పోసుకుని ఆయన బ్రతకాలి … Read more

    చంద్రబాబు గాడ్సే కంటే ఘోరం: రోజా

    AP: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లపై మంత్రి రోజా ఫైర్‌ అయ్యారు. ప్రజాసొమ్ము దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని మండిపడ్డారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని విమర్శించారు. అటు 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని దుయ్యబట్టారు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీదని మండిపడ్డారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బుడిద రాలుతుందని ఎద్దేవా చేశారు.

    ‘చేతులతో సూర్యోదయాన్ని ఆపలేరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సినీ నటుడు, మాజీ ఎంపీ మురళిమోహన్‌ ఖండించారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ప్రారంభానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ గేట్స్‌ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడం బాధాకరమన్నారు. ఉదయించే సూర్యోదయాన్ని ఆపడానికి చేతులు అడ్డుపెట్టడం మూర్ఖత్వం అవుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బయటకు వస్తారని.. ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి జరుగుతుందని మురళీమోహన్ చెప్పారు. మాజీ CM చంద్రబాబు నాయుడి గొప్పతనం మురళి మోహన్ గారి మాటల్లో#ChandrababuNaidu … Read more

    నేడు జైలులో చంద్రబాబు దీక్ష

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఈరోజు నిరశన దీక్ష చేపట్టనున్నారు. సత్యమేవ జయతే పేరుతో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి ఈరోజు రాజమండ్రి క్వారి సెంటర్‌లో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన చేపట్టనున్నారు. అనంతరం ఆమె ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్యనేతలందరూ పాల్గొంటారు.

    చంద్రబాబుపై మరో కేసు

    చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని సుప్రీంకోర్టును మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ ఛార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావన ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ పురోగతిపై ఆరా తీయ్యాలని కోర్టును కోరారు. అక్టోబరు 3న ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే స్కిల్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు.

    ‘చంద్రబాబు డబ్బుకోసం కక్కుర్తి పడరు’

    తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై దర్శకుడు రవిబాబు స్పందించారు. రాజకీయ నాయకులకు అధికారం అసలు శాశ్వతం కాదన్నారు. అలాగే చంద్రబాబుకు వచ్చిన కష్టాలూ శాశ్వతం కాదని చెప్పారు. ‘చంద్రబాబు ఏదైనా పనిచేస్తే 100 కోణాల్లో ఆలోచించి చేస్తారు. ఆయనకు భూమి మీద ఇవాళే ఆఖరి రోజని తెలిసినా కూడా వచ్చే 50 ఏళ్ల అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదు. అలాంటి వ్యక్తిని ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అర్థం కావట్లేదు’ అని రవిబాబు … Read more

    చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు నిరసన

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేశారు. నగరంలోని విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామని ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు చేపట్టిన యామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. … Read more

    మా కుటుంబానికి ఇది కష్టకాలం: భువనేశ్వరి

    చంద్రబాబు భద్రతపై ఆయన సతీమణి నార భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు. కుటుంబంకంటే ప్రజలే తనకు ముందర అనేవారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఆయన నిర్మించిన జైలులోనే కట్టిపడేశారు. ప్రజాపోరాటానికి ఏపీ ప్రజలంతా సహకరించాలి. మా కుటుంబానికిది కష్టకాలం ఇది. రాష్ట్రప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’ అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. https://x.com/GlintInsights/status/1701619853613039855?s=20

    ‘చంద్రబాబును కాపాడమ్మ సామాలమ్మ తల్లి’

    చంద్రబాబును కాపాడాలని కోరుతూ మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో నగరిలో మహిళలు పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో టీడీపీ నాయకులు, మహిళలలు నగరిలో సామాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని సామాలమ్మను ప్రార్థించారు. చేతిలో వేపమండలు పట్టుకుని ‘సామలమ్మా చంద్రబాబును కాపాడమ్మ’ అంటూ భక్తితో పూజలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. https://x.com/TeluguScribe/status/1701274175263142381?s=20

    చంద్రబాబు కన్వాయ్ నిలిపివేత.. తీవ్ర ఉద్రిక్తత

    పల్నాడు- చిలకలూరిపేటలో చంద్రబాబు కాన్వాయ్ నిలిచిపోయింది. పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో పోలీసులు కాన్వాయ్‌ను నిలిపివేశారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం జగన్ దిష్టి బొమ్మను తగలబెట్టిన కార్యకర్తలు రోడ్లపైకి పెద్ద పెద్ద టైర్లను మోహరించి నిప్పు పెట్టారు. దీంతో చిలుకలూరిపేట- విజయవాడ హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్‌ క్లియర్ చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున బయటకు వచ్చిన ప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు.. #WeWillStandWithCBNSir#ChandrababuNaidu#G20India2023 pic.twitter.com/SmyPYcJIF0 — iTDP Official (@iTDP_Official) September … Read more