• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విషాదం; కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి

  తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ మృతి చెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మంత్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లో కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ [కాల్పులు](url) జరిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. Moment When Odisha Health Minister #NabaDas Shot. … Read more

  విషాదం; కాల్పుల్లో గాయపడిన మంత్రి మృతి

  తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నబ కిశోర్ దాస్ మృతి చెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్‌లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. మంత్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లో కిశోర్ దాస్‌పై ఏఎస్ఐ గోపాల్ దాస్ [కాల్పులు](url) జరిపిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. Moment When Odisha Health Minister #NabaDas Shot. … Read more

  శ్మశానంలో కళ్లు తెరిచిన వృద్ధురాలు

  ఓ వృద్ధురాలు చనిపోయిందని శ్మశానానికి తీసుకువెళ్తుండగా కళ్లు తెరిచింది. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా బిలాస్‌పూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన హరిభేజి(80) అనే వృద్ధురాలు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆస్పత్రిలో మరణించింది. మర్నాడు కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్లగా.. అక్కడ హఠాత్తుగా కళ్లు తెరిచింది. దీంతో ఆమె కుటుంబసభ్యుల ఆనందా నికి అవధులు లేకుండాపోయాయి. కానీ మరుసటి రోజే వృద్ధురాలు మరణించింది.

  చనిపోతూ 45 మందిని కాపాడాడు

  బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం వద్ద చోటుచేసుకుంది. ఏపీకి చెందిన 45 మంది భక్తులు భద్రాచలం దర్శనం అనంతరం యాదాద్రికి బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ జే.దేవాయిరక్కం(50) గుండెపోటుకు గురయ్యాడు. బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఇసుక లారీలను తప్పించి మరీ డ్రైవర్ సీటులోనే కుప్పకూలిపోయాడు. యాత్రికులు ఎవరికీ గాయాలు కాలేదు.

  సరస్సు ప్రమాదం; మూడుకు చేరిన మృతులు

  అమెరికాలో జరిగిన సరస్సు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని గుంటూరు జిల్లా పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరి ఫ్యామిలీ ఫ్రెండ్‌ మడిశెట్టి గోకుల్‌తో కలసి విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో ఫీనిక్స్‌లో ఉన్న సరస్సు దాటే క్రమంలో మంచు ఫలకలు కుంగటంతో సరస్సులో పడిపోయారు. అదే రోజు నారాయణ, హరిత మృతదేహాలు లభ్యం కాగా ప్రస్తుతం గోకుల్ డెడ్‌బాడీ లభించింది.

  కోనసీమలో విషాదం; భార్య వెంటే భర్త కూడా..

  భార్య మరణించడంతో తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని అమలాపురంలో చోటుచేసుకుంది. బోనం విజయ్‌ కుమార్ (47), బోనం తులసీలక్ష్మీ(45)లు భార్యభర్తలు. అనారోగ్యంతో బాధపడుతూ విజయలక్ష్మీ మృతి చెందింది. ఇది తట్టుకోలేక వెంటనే విజయ్‌ తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రుల మృతదేహాలపై అతడు రోదించిన తీరు అందరినీ కలచివేసింది.

  బాలిక మిస్సింగ్ విషాదాంతం

  హైదరాబాద్‌లో అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్థిని ఇందు అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. ఇందు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం ఇందును తండ్రి నరేష్ పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. ఆ తర్వాత బాలికా ఎక్కడా కనిపించలేదు. తల్లిడండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించగా చెరువు వైపు వెళ్తున్నట్లు కనిపించింది.

  గొంతులో చాక్లెట్ ఇరుక్కొని బాలుడు మృతి

  వరంగల్ లో విషాదం జరిగింది. గొంతులో చాక్లెట్ ఇరుక్కొని ఓ బాలుడు మృతి చెందాడు. రాజస్థాన్ కు చెందిన కన్ గహన్ సింగ్ వరంగల్ లో ఎలక్ట్రికల్ షాప నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ పిల్లలకు చాక్లెట్లు తీసుకువచ్చాడు. పిల్లలను స్కూల్ లో దింపడానికి వెళ్లేటప్పుడు చాక్లెట్లు ఇచ్చారు. అవి తింటున్న వారి కుమారుడు సందీప్ పాఠశాల మెుదటి అంతస్తుకు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు. చాక్లెట్ తట్టుకొని శ్వాస ఆడక చనిపోయినట్లు నిర్ధారించారు.

  నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

  ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలిగొంది. నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో ఉన్న గోల్ఫ్‌కోర్స్ వద్ద చోటుచేసుకుంది. గోల్ఫ్‌కోర్స్‌లోని ఓ నీటి గుంతలో ఈత కొట్టడానికి ముగ్గురు చిన్నారులు ప్రయత్నించారు. లోతు తెలియక ఒకరి వెంట మరొకరు నీటిగుంటలో పడి చనిపోయారు. మృతులను దిలీప్, పవన్, షాబాద్‌లుగా పోలీసులు గుర్తించారు. కాగా గోల్ఫ్‌కోర్స్‌కు రక్షణ గోడ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు.

  ఉన్నతోద్యోగంలో చేరకుండానే..

  టీఎస్ఎంస్ఐడీసీ ఎండీ కె.చంద్రశేఖరరెడ్డి కుమారుడు అభిజిత్‌రెడ్డి 22 ఏళ్లకే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఇటీవలే ’సౌదీ ఆరామ్‌కో’ సంస్థలో అభిజిత్ ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దాదాపు రూ.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. మరో నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పిన్న వయసులోనే అభిజిత్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.