• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత..

  ఆమె ఓ గాన కోకిల. ఆమె స్వరంతో ఎన్నో మధురమైన గీతాలను పాడింది. దేశ విదేశాల్లో తన గాత్రం వినిపించి పాటకు ప్రాణం పోసింది. ఆమె పాడిన పాట వింటే చాలు అలా మైమరచిపోవాల్సిందే. అలాంటి గొంతు ఇప్పుడు మూగబోయింది. విషయంలోకి వెళ్తే.. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ్ గాయని లతా మంగేష్కర్ నేడు తుదిశ్వాస విడిచింది. కారోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూనే మరణించింది. గత 29 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె నేడు కన్నుమూసినట్లు ఆమె సోదరి ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

  తన గొంతుతో ఎన్నో హిట్ పాటలను పాడిన లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. మరాఠి, హిందీ భాషల్లో అధికంగా పాటలు పాడిన లతా తెలుగులోనూ పలు పాటలు పాడారు. 50వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ దేశ విదేశాల్లో కూడా ప్రఖ్యాతగాంచారు. సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన మంగేష్కర్‌ 20 భారతీయ భాషల్లో 980 చిత్రాలకు గాను, 50 వేలకుపైగా పాటలు పాడారు. తెలుగులోనూ మూడు పాటలు పాడారు. ఈమె పాటలకు దేశ వ్యాప్తంగా అభిమానులుండగా.. ఆమె మరణ వార్తను అభిమానులతో సహా దేశం మొత్తం జీర్ణించుకోలేకపోతోంది.

  లతా మంగేష్కర్ మరణ వార్త విన్న ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. లతా మంగేష్కర్ ఓ అద్భుత గాయని అని, ఆమె మరణం భారత సంగీతానికి తీరని లోటు అని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, పలు రాష్ట్రాల సీఎంలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. సినిమా ఇండస్ట్రీతో ఆమెకు అధికంగా అనుబంధం ఉండడంతో సినీ ప్రముఖులు సైతం ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. లతా మంగేష్కర్ మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల మౌన దినాలు ప్రకటించింది.

  లతా మంగేష్కర్‌కు దేశ అత్యున్నత పురష్కారం ‘భారత రత్న’ను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇలా ఎన్నో అవార్డులను పొందారు. ఎన్నో మధురమైన గానాలను మనకు పంచి, మన నుంచి దూరంగా వెళ్లిపోయిన లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని మనం ప్రార్థిద్దాం.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv