• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ADIPURUSH: బీర్ బాటిల్‌తో కోసుకున్న అభిమాని

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ నేడు విడుదలైంది. ఈ క్రమంలో థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పాలతో అభిషేకాలు, టపాసులు కాల్చడం వంటి వాటితో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కటౌట్ వద్ద ఓ అభిమాని బీర్‌బాటిల్‌తో చేయి కోసుకుంటూ హంగామా చేశాడు. పెద్ద పెద్దగా అరుచుకుంటూ పదే పదే చేయిని కోసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Offline cult fans ?? … Read more

    అభిమాని చివరి కోరిక తీర్చిన ప్రభాస్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తన వీరాభిమాని చివరి కోరిక తీర్చాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రంజిత్ అనే ఓ అభిమానిని కలవడమే కాకుండా అతడికి ఇష్టమైన చికెన్ మంచూరియా తినిపించాడు. అంతేకాకుండా అతడికి బట్టలు కూడా కొనిపెట్టాడు. బాహుబలి సినిమాలో వాడిన ఓ కత్తిని అప్పటికప్పుడు తెప్పించి అతడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాలన్నింటినీ రంజిత్ తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రభాస్‌కు ఎప్పటికైనా గుడి కట్టాలని రంజిత్ అనుకునేడు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయాడు. #Prabhas fulfilled his fans last … Read more

    చెర్రీని చూసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుడు

    టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌ను చూసేందుకు ఓ బాలుడు సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఎట్టకేలకు చెర్రీని కలుసుకున్నాడు. చరణ్‌ను చూసి ఆ బాలుడు తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ బాలుడిని రామ్‌చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆ బాలుడు తిరిగి తన సొంతూరికి క్షేమంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి సూచించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Man with Golden Heart❤️ A little fan Boy of @AlwaysRamCharan garu came … Read more

    మోదీపై ‘బంగారు’ ప్రేమ; 156 గ్రాముల స్వర్ణవిగ్రహం

    భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమతో ఓ వ్యాపారి ఏకంగా బంగారంతో ఆయన బొమ్మను తయారు చేశాడు. సూరత్‌కు చెందిన రాధిక చైన్స్ యజమాని బసంత్ బోహ్రా ప్రధాని మోదీకి వీరాభిమాని. ఆయనపై అభిమానంతో 156 గ్రాముల బంగారంతో [‘స్వర్ణ విగ్రహం’](url) తయారు చేశాడు. ఈ విగ్రహం తయారు చేయడానికి 20 కళాకారులకు దాదాపు 3 నెలల సమయం పట్టింది. ఈ విగ్రహం తయారీకీ సుమారు రూ.11 లక్షలు ఖర్చు అయింది. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని బాంబే గోల్డ్ ఎగ్జిబిషన్‌లో ఉంచారు. This … Read more

    అర్జెంటీనాలో ఫ్యాన్స్ హంగామా

    ఫ్రాన్స్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. రాజధాని బ్యూనోస్ ఐరీస్‌లో ఫ్యాన్స్ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో తరలివచ్చి హంగామా చేశారు. వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. కొందరు చొక్కాలు చింపేసి దేశ జెండాను ప్రదర్శిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. 36 ఏళ్ల తర్వాత మళ్లీ కల నెరవేరడంతో భావోద్వేగానికి గురయ్యారు. చిన్న పెద్దా తేడా లేకుండా వేడుకలు జరుపుకున్నారు. మెస్సీ తమ కలను సాకారం చేశాడని తెగ సంబరపడుతున్నారు.