• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

    జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాక్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రస్తుతం ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అర్మీ అధికారులు తెలిపారు.

    ఆర్మీ వాహనంపై దాడి ఉగ్రవాదుల పనే: సైన్యం

    [VIDEO](url): జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడి ఉగ్రవాదుల పనేనని సైన్యం ప్రకటించింది. గుర్తు తెలియని ముష్కరులు వాహనంపై గ్రనేడ్లు విసిరినట్లు సైన్యాధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని అధికారులు తెలిపారు. చనిపోయిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన వారని పేర్కొన్నారు. ఘటనస్థలిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. #WATCH | Security forces secure the area where … Read more

    పిండి కోసం ట్రక్కు వెంబడి పరుగులు

    పాకిస్థాన్‌లో ఆహార సంక్షోభం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గోధుమ పిండి కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ట్రక్కు వెంట పరుగులు తీసి పిండిని దక్కించుకుంటేనే పూట గడుస్తుండటంతో స్థానికులు ఈ సాహసానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టు చేసిన వ్యక్తి జమ్మూ కశ్మీర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. దీనికోసమేనా పాకిస్థాన్‌లో జమ్మూ కశ్మీర్‌ని విలీనం చేయాలని కోరుకుంటున్నది? పాకిస్థానీగా ఉండనందుకు అదృష్టంగా భావిస్తున్నా. పాకిస్థాన్‌తో మనకు ఏమైనా భవిష్యత్ ఉంటుందా?’ అంటూ ట్వీట్ … Read more