• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏజెంట్‌ నుంచి ‘వైల్డ్‌ సాల’ పాట రిలీజ్

    అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కిన ఏజెంట్‌ సినిమా నుంచి ‘వైల్డ్‌ సాల’ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటను భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఏజెంట్‌ సినిమాకు.. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేస్తోంది. ఏప్రిల్‌ 28న ఏజెంట్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ తన గత సినిమాల కంటే ఎంతో భిన్నంగా ఏజెంట్‌లో కనిపించనున్నాడు.

    ఏజెంట్‌ మూడో సింగిల్ ప్రోమో

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి మరో పాట విడుదలకు సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి మేకర్స్‌ ప్రోమోను విడుదల చేశారు. రామకృష్ణ గోవింద అంటూ పాట సాగుతోంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం 5.05 గంటలకు విడుదల చేయనున్నారు. హిప్‌హాప్‌ తమిజా సంగీతం అందించాడు. చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా… ఏకే ఎంట్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    అఖిల్‌కు సమంత బర్త్‌డే విషెస్; రిప్లై ఇస్తాడా?

    టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఏజెంట్ మూవీ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్.’’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌కు అఖిల్ రిప్లై ఇస్తాడా.. ఇవ్వడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నా.. అక్కినేని కుటీంబీకులతో మంచి రిలేషన్ కొనసాగిస్తోంది. … Read more

    ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యింది

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మళ్లీ మళ్లీ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యిందంటూ చిత్ర యూనిట్‌ పాటను విడుదల చేశారు. హిపాప్‌ తమిజా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న ట్రైలర్ విడుదల కానుంది.