• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

  నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘గణేష్ ఆంతం’ పేరుతో ఓ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలలు నటించారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది.

  ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో

  టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజైంది. ‘టికెటే కొనకుండా’ అనే సాంగ్ ప్రోమోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ మిరియాల ఈ సాంగ్‌ను ఆలపించారు. ఫుల్ లిరికల్ సాంగ్ జూలై 26న విడుదల కానుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. Atla untadi Mana Tillu Thone ?❤#TilluSquare … Read more

  ‘భోళాశంకర్’ నుంచి ‘జజ్జనక’ సాంగ్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది. ‘జాం జాం జజ్జనక’ అంటూ సాగే సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాశర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. కాగా ఈ మూవీలో చిరు సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. మెహెర్ రమేశ్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర నిర్మించారు. ఆగష్టు 11న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

  ‘ఖుషీ’ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

  టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఖుషీ’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్‌గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు. #Aradhya song … Read more

  టమాటా పేరడీ సాంగ్: చూశారా?

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. కిలో టామాటా ఏకంగా రూ.150కిపైగా పలుకుతోంది. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ కుషాల్ టామాటాలపై పేరడీ సాంగ్ క్రియేట్ చేశాడు. సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. టమాటా ధరలపై కుషాల్ టీం పేరడీ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ప్రముఖ తమిళ్ సాంగ్ ‘‘తుమ్ తుమ్‘కు పేరడీ లిరిక్స్ యాడ్ చేశారు. ఈ లిరిక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను 5 లక్షల మంది చూశారు.

  ‘అహింస’ నుంచి మరో సాంగ్ ప్రొమో

  టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ హీరోగా, గీతికా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘అహింస’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన 2న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే సినిమా టీజర్, పోస్టర్స్, మూడు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి. తాజాగా మరో సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ‘‘ఉందిలే.. ఉందిలే’’ అంటూ సాగే పాటను ప్రేక్షకుల కోసం వదిలారు. ఈ సాంగ్‌ను చంద్రబోస్ రాయగా జావేద్ ఆలీ, జయశ్రీ పాడారు.

  HYD మేయర్‌పై ఆర్జీవీ పాట; ఇంటర్నెట్ షేక్

  [వీడియో;](url) హైదరాబాద్ ‌మేయర్ గద్వాల్ విజయలక్ష్మీపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాట పాడి రిలీజ్ చేశారు. ‘కుక్కల మేయర్’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ను చూసిన నెటిజన్లు ఆర్జీవీని తెగ పొగిడేస్తున్నారు. ప్రశ్నించడంలో ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మేయర్‌ను ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. Full VIDEO song KUKKALA MAYOR … Read more

  యూట్యూబ్‌లో ‘ధూమ్ ధామ్’ రచ్చ

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ మూవీలోని ‘ధూమ్ ధామ్’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృస్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ పాట ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ సాధించింది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 102 K రీల్స్ సాధించి రికార్డులు సృస్టిస్తోంది. కాగా ఈ మూవీలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. మార్చి 30న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

  ‘ప్రిన్స్’ నుంచి మరో సాంగ్ రిలీజ్

  తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘జెస్సికా’ పాటను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో వదిలారు. ఇంతకుముందు ‘బింబిలక్కి పిలపి’ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సినిమాలో కార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్ నటి మరియా నటించింది. జాతిరత్నాలు ఫేం అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వచ్చే దీపావళికి ఈ చిత్రాన్నిథియేటర్లలో విడుదల చేస్తున్నారు.