లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. 345 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్ సూచీ ప్రస్తుతం 59,218 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు 103 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ 17,630 పాయింట్ల వద్ద కదలాడుతోంది. అదాన్ పోర్ట్స్, SBI లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, టాటా మోటార్స్, మారుతి షేర్లు నష్టాల్లో ఉన్నాయి.