Tata Nexon facelift: తక్కువ ధరలో దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త కారు… సోనెట్, కిగర్‌లకు గట్టి సవాల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tata Nexon facelift: తక్కువ ధరలో దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త కారు… సోనెట్, కిగర్‌లకు గట్టి సవాల్

    Tata Nexon facelift: తక్కువ ధరలో దిమ్మతిరిగే ఫీచర్లతో కొత్త కారు… సోనెట్, కిగర్‌లకు గట్టి సవాల్

    September 14, 2023

    ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా నుంచి మరో కొత్త కారు లాంచ్ అయింది. మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ పేరుతో కారును తీసుకొచ్చారు. దీని ఎక్స్‌ షోరూం ధర రూ.8.09 లక్షలుగా నిర్ణయించారు. Nexon facelift కారను ప్రధానంగా సెఫ్టీ ప్రధానంగా రూపొందించారు. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఇప్పటికే  ఉన్న హ్యూందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300 మారుతి సుజుకి బ్రెజా కార్లకు గట్టి పోటీ అయితే ఇవ్వనుంది. మరి దీని ఫీచర్లు, మైలేజ్ ఇతర ప్రత్యేకతలు ఇప్పుడూ చూద్దాం.

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డీజైన్(Nexon facelift design)

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌ను కర్వ్, టాటా హారియర్ ఈవీ మోడల్స్ అనుసరించి తయారు చేశారు. ట్రాపెజోయిడల్ హౌసింగ్‌లో ఉంచిన హెడ్‌లైట్‌లతో కూడిన స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ అమర్చబడింది. బంపర్‌ బాగంలో సీక్వెన్షియల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లు (DRLలు), టాటా మోటార్స్ లోగో  స్లిమ్ అప్పర్ గ్రిల్‌తో కనెక్ట్ చేయబడి ఉంది.

    16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌, కొత్త యాక్సెంట్ లైన్‌, కాంట్రాస్టింగ్ కలర్‌లో హైలెట్‌గా నిలిచాయి.

    డైమెన్షన్ పరంగా పాత నెక్సాన్ పోలిస్తే ఈ కొత్త SUVలో  పెద్దగా మార్పు లేదు.  ఎత్తు 2mm, పోడవు 14mm పెరిగింది, వెడల్పు 7mm తగ్గింది. వీల్‌బేస్ 2,498mm, గ్రౌండ్ క్లియరెన్స్ 208mm వద్ద అలాగే ఉన్నాయి.. టాటా మోటార్స్ కూడా బూట్ స్పేస్‌ను 32 లీటర్లు పెంచింది. ఇది ఇప్పుడు 382 లీటర్లుగా ఉంది.

    క్యాబిన్ డీజైన్

    టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్ డీజైన్.. టాటా కర్వ్ కాన్సెఫ్ట్‌ను ఫాలో అయింది. సెంటర్ కన్సోల్‌ ప్రాంతంలో ఫిజికల్ బటన్స్‌కు బదులు టచ్ స్క్రీన్‌ను అందించారు. యాంగ్యూలర్ ఏసీ వెంట్స్‌తో పాటు డ్యాష్‌ బోర్డ్ లెదర్ ఇన్‌సర్ట్స్, కార్బన్ పైబర్ ఫినిషింగ్‌తో అట్రాక్ట్ చేస్తుంది.

    టాటా నెక్సాన్ Revotron 1.2L టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 118 bhp వద్ద 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బేస్ వేరియంట్‌లో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌,  హై-ఎండ్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అమర్చారు. 

    ఇక డీజిల్ వేరియంట్ Revotorq 1.5L ఇంజిన్‌ను కలిగి ఉంది, 114 bhp వద్ద 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమెటెడ్ ట్రాన్స్‌మిషన్ల (AMT) కలయికతో వచ్చింది.

    మైలేజ్ (Nexon facelift Mileage) 

    గతంలో వచ్చిన నెక్సాన్ మోడళ్ల కంటే ఇంది మెరుగైన మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ వేరియంట్ 17.33kmpl మైలేజ్ సాధిస్తే, డీజిల్ వేరియంట్ 23.22kmpl మైలేజ్ అందించనుంది.

    కలర్ ఆప్షన్స్

    టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆరు రంగుల్లో లభ్యమవుతోంది. ఫియర్‌లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 

    వీటికి గట్టి పోటీ

    మిడ్ రేండ్ SUV సెగ్మెంట్లో నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.. మహీంద్రా XUV300, మారుతి సుజుకి ఫ్రాంక్స్,  మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు గట్టి పోటీ అయితే ఇస్తోంది.

    ధర

    టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ధరు రూ.8.01 లక్షలుగా నిర్ణయించారు. వేరియంట్‌ను బట్టి రూ.8లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు కారు ధర ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version