బాక్సాఫీస్ వద్ద మళ్లీ సినిమాల సందడి వచ్చేసింది. ఈ వారం థియేటర్లతోపాటు ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 16న ఏకంగా ఎనిమిది మూవీలు థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే చిత్రాలు, నటీనటుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి – 16 సెప్టెంబర్
సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని కలిగి ఉంది. ఈ చిత్రానికి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.
నేను మీకు బాగా కావాల్సినవాడిని – 16 సెప్టెంబర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఈ వారం విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. సంజన ఆనంద్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి శ్రీధర్ గాధే దర్శకత్వం వహించారు.
శాకిని ఢాకిని – 16 సెప్టెంబర్
నివేదా థామస్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన ‘శాకిని ఢాకిని’ ఈ వారం విడుదల కానున్న భారీ చిత్రాలలో ఒకటి. ఈ కామెడీ థ్రిల్లర్ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘మిడ్‌నైట్ రన్నర్స్’ (కొరియన్) చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.
అం ఆహా – 16 సెప్టెంబర్
జంగం సుధాకర్, లావణ్య కొత్త జంటగా నటించిన ఈ చిత్రం ఈ వారం ‘అం ఆహా’తో తమ భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహించారు.
నేను C/o నువ్వు – 16 సెప్టెంబర్
1980వ దశాబ్దాపు యాదార్థ ప్రమ కథగా ‘నేను C/O నువ్వు’ను దర్శకుడు సాగారెడ్డి తుమ్మ తెరకెక్కించారు. వివాదాస్పద కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో ధన్ రాజ్, రత్న కిషోర్, సాగా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
సకలగుణాభి రామ – 16 సెప్టెంబర్
వీజే సన్నీ, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సకలగుణాభి రామ.’ ఈ ఫ్యామిలీ డ్రామాకి వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
K3 కోటికొక్కడు – 16 సెప్టెంబర్
కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం కే3. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ కార్తీక్ దర్శకత్వం వహించారు.
ది లైఫ్ ఆఫ్ ముత్తు – 17 సెప్టెంబర్
తమిళ నటుడు శింబు టాలీవుడ్‌లో మరో భారీ విడుదలతో తిరిగి వస్తున్నాడు. ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధి ఇద్నాని, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
OTT Releases
Title | Category | Language | Platform | Release Date |
Vikram | Movie | Pan-India | Zee5 | 13 September |
Rama Rao on Duty | Movie | Tel,Tam,Ka,Ma | Sony Liv | 15 September |
Shiksha Mandal | Series | Hindi | MX Player | 15 September |
Vikrant Rona | Movie | Telugu | Hotstar | 16 September |
Jogi | Movie | Hindi | Netflix | 16 September |
Attention Please | Movie | Malayalam | Netflix | 16 September |
Timepass 3 | Movie | Marathi | Zee5 | 16 September |
Dahan | Series | Hindi | Hotstar | 16 September |
College Romance S-3 | Series | Hindi | Sony Liv | 16 September |
Belashuru | Movie | Bengali | Hoichoi | 16 September |
Goodnight Mommy | Movie | English | Prime Video | 16 September |
Do Revenge | Movie | English | Netflix | 16 September |
Blonde | Movie | English | Netflix | 16 September |
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ