Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!

    Telugu Movies: ఈవారం (June 23) థియేటర్లు/OTTల్లో రిలీజ్‌ కానున్న సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..!

    June 19, 2023

    పోయిన వీకెండ్.. థియేటర్‌లలో ఆదిపురుష్ హవా కొనసాగింది. ఈ వారం పలు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అలాగే OTT వేదికలపైనా.. కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

    1920

    అవికా గోర్ లీడ్‌ రోల్‌లో నటించిన 1920 హారర్స్ ఆఫ్‌ ది హార్ట్ మూవీ జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్‌భట్ తెరకెక్కించారు. 2008లో విడుదలై హిట్ సాధించిన ‘1920’ సినిమాకు కొనసాగింపుగా ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సీక్వెల్ రానుంది. ఈ చిత్రం విక్రమ్ భట్ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అవికా గోర్‌తో పాటు రాహుల్ దేవ్, దానిష్ పాండర్, రణధీర్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.

    ధూమం (Dhoomam)

    పుష్ప ఫేమ్ ఫహద్‌ఫాజిల్ ముఖ్య పాత్రలో సరికొత్త కథతో ధూమం మూవీ ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ‘యూ టర్న్ దర్శకుడు పవన్ కూమర్ డైరెక్ట్ చేశారు. ఫహద్‌ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. ధూమం సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తమిల్, తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

    మనుచరిత్ర

    మేఘా ఆకాష్(Megha Akash), శివ కందుకూరి(Shiva kandukuri) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మను చరిత్ర'(Manu Charitra). ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదల కానుంది. భరత్ పెదగాని డైరెక్ట్ చేస్తున్నారు. రాన్ సన్ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా.. కాజల్ అగర్వల్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు మను చరిత్రపై హైప్‌ను పెంచాయి.

    భారీ తారా గణం

    యూత్‌ ఫుల్ లవ్ స్టోరీగా జూన్ 23న అలరించేందుకు వస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’. ఈ చిత్రంలో సదన్, రేఖా నిరోషా, దీపికా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ ముత్యాల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. BVR పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    ఇంటింటి రామాయణం

    ఇప్పటికే థియేటర్లలో కామెడీ పంచిన ‘ఇంటింటి రామాయణం’ చిత్రం.. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో జూన్ 23నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), నవ్య స్వామి(Navya Swami) లీడ్ రోల్స్‌లో నటించారు. 

    టీకూ వెడ్స్ షేరు

    ఫస్ట్‌ టైం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి నిర్మిస్తున్న చిత్రం టీకూ వెడ్స్ షేరు(Tiku Weds Sheru). ఈ సినిమాలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్‌ కౌర్‌ (Avneet Kaur) ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సాయి కబీర్‌ శ్రీవాస్తవ డైరెక్ట్ చేశారు. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 23న నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈనెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది.

    కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files)

    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌ మలయాళంలో ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’ అనే కొత్త వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఓ లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి విచారణ చేపట్టిన ఆరుగురు పోలీస్‌ అధికారులు ఏం చేశారు? షిజు, పరయల్‌ వీడు, నీందకర అనే క్లూను వాళ్లు ఎలా ఛేదించారు? అనే కథాంశంగా ఈ సిరీస్ తెరకెక్కింది. లాల్‌, అజు వర్గీస్‌ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 23నుంటి స్ట్రీమింగ్ కానుంది.  మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‌కానుంది.

    ఈ వారంలో OTTల్లో రిలీజ్ కానున్న మరికొన్ని చిత్రాలు

    TitleCategoryLanguagePlatformRelease Date
    Take Care of MayaMovieEnglishNetflixJune 19
    GlamorousWeb SeriesEnglishNetflixJune 21
    Sleeping DogWeb SeriesEnglishNetflixJune 22
    Social CurrencyWeb SeriesHindiNetflixJune 22
    Kisika Bhai Kisiki JaanMovieHindiZEE5June 23
    Class of 09 Web SeriesEnglishDisney + HotstarJune 19
    Secret InvasionMovieEnglishDisney + HotstarJune 21
    The Kerala StoryMovieHindiDisney + HotstarJune 23
    World’s Best MovieEnglishDisney + HotstarJune 23
    AgentMovieTeluguSony LivJune 23
    Lions Gate PlayMovieEnglishSony LivJune 23
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version