ఈ రోజుల్లో వినోదం అనగానే ముందుగా థియేటర్లు, టీవీలు, ఓటీటీలు, బ్రౌజింగ్ క్రికెట్ వంటివి గుర్తుకువస్తాయి. కానీ ఒకప్పుడు అలా కాదు. మనకి ముందున్న జనరేషన్స్ వాళ్లు పుస్తకాలతోనే ఎక్కువగా తమ సమయాన్ని గడిపేవారు. పుస్తకాల నుంచే వినోదంతో పాటు విజ్ఞానాన్ని సంపాదించేవారు. అయితే, నేటి తరం పుస్తకాలను చదవడం తగ్గించేసింది. చాలామందికి చదవాలన్న కుతూహలం ఉన్నా ఏయే పుస్తకాలు చదవాలో క్లారిటీ ఉండదు. ఇందుకోసం YouSay చిరు ప్రయత్నం చేసింది. మిమ్మల్ని బుక్ లవర్స్‌గా మార్చే పుస్తకాలను సంగ్రహించి వాటి తాత్పర్యం, సారాంశాలను క్రోఢీకరించింది. ఈ పుస్తకాలు చదవితే మీకు రీడింగ్‌పై అమితాసక్తి కలగడం ఖాయం.
1. నవల : వెన్నెల్లో ఆడపిల్ల
రచయిత : యండమూరి వీరేద్రనాథ్
కథేంటి: ఒక చదరంగం క్రీడాకారుడికీ, ఆక్స్‌ఫర్డ్ విద్యార్థినికీ మధ్య జరిగే ప్రేమకథ ఈ నవల వృత్తాంతం. ఇందులో కథానాయిక, కథానాయకుడితో కేవలం ఫోన్ లో మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆమె ఫోన్ నంబరును కనుక్కోవాలని, ఆమెను చూడాలని ప్రయత్నిస్తుంటాడు. సంభాషణ సమయంలో అమ్మాయి తన పేరు మరియు చిరునామాను గుర్తించమని సవాలు విసురుతుంది. మరి కథానాయకుడు రేవంత్ ఆ అమ్మాయిని కనిపెట్టాడా? లేదా? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ: ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఫుల్ లెన్త్ సస్పెన్స్ రొమాంటిక్ నవల ఇది. ఎక్కడా బోరు కొట్టకుండా కొత్త కొత్త విషయాలను మనకు నేర్పిస్తూ కథ సాగుతుంది. క్షణం క్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. వరల్డ్ చెస్ ఛాంపియన్ రేవంత్ తన ప్రేమను దక్కించుకోవటానికి పడే కష్టాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. క్లైమాక్స్ మనల్ని కంటతడి పెట్టించక మానదు.
Buy Now
2.నవల : మైదానం
రచయిత : చలం
కథేంటి? : బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి.. ముస్లిం అయిన అమీర్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. అప్పటివరకూ ఎన్నో వైభోగాలు అనుభవించిన ఆమె పెళ్లి తర్వాత అనేక కష్టాలు పడుతుంది. అయినప్పటికీ భర్తనే ఆరాదిస్తుంటుంది. అయితే అమీర్.. రాజేశ్వరినీ కాదని పరాయి స్త్రీ వ్యామోహంలో పడతాడు. అప్పుడు రాజేశ్వరి ఏం చేసింది?. భర్త కోసం ఎలాంటి త్యాగానికి పూనుకుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: సంప్రదాయ కుటుంబంలో జన్మించిన స్త్రీ మనస్తత్వాన్ని రచయిత చక్కగా చూపించాడు. అప్పటివరకూ కట్టుబాట్లతో జీవించిన మహిళలో ప్రేమకి పరాకాష్టగా శారీరిక సుఖం, త్యాగం, స్వేచ్ఛ, మోహాం, తిరుగుబాటు తనాన్ని చూపించాడు
Buy Now
3. నవల : అమరావతి కథలు
రచయిత : సత్యం శంకరమంచి
కథేంటి?:
అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన 100 కథల సమాహారమే ఈ అమరావతి కథల సంపుటి. ఒక పేజీకి మించని కథల్లో రచయిత ఎన్నో విషయాలను తెలియజేశారు. తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించాడు. ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులంగా రాశారు. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఓ ఈవెంట్‌లో అమరావతి కథల గురించి ప్రత్యేకంగా మాట్లాడిన త్రివిక్రమ్ వాటిపై ప్రశంసలు కురిపించారు.
Buy Now
4. నవల : చిల్లర దేవుళ్లు
రచయిత : దాశరథి రంగాచార్య
కథేంటి?:
తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరుకు సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువుకు కోసం వస్తాడు. ఊళ్ళో దొరది ఎదురులేని శాసనమని తెలుకుంటాడు. చిన్న చిన్న తప్పులు చేసినా, తన అధికారాన్ని ఏమాత్రం తక్కువ చేసినా దొర ఎలాంటి కఠినశిక్షలు విధిస్తాడో కళ్లారా చూస్తాడు. నిజాం మనుషులు కూలీలను బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే వారు హిందువులూ కాలేక, ముస్లిములుగానూ ఇమడలేక వారుపడే బాధలను నవల ప్రతిబింబిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కథ ఎలా మలుపులు తిరిగి చివరకు ఏమైందనేది మిగిలిన ఇతివృత్తం.
విశ్లేషణ: తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు నవలలో చక్కగా చూపించాడు. తెలంగాణలో 1942 వరకూ ఉన్న స్థితిగతులను ‘చిల్లర దేవుళ్లు’ నవల ప్రతిబింబిస్తుంది.
Buy Now
5. నవల : వెయ్యి పడగలు
రచయిత : విశ్వనాథ సత్యనారాయణ
కథేంటి?:
ఆధునిక మహాభారతంగా గౌరవింపబడే ఈ నవల ముఖ్యంగా ధర్మా రావు అనే వ్యక్తి జీవిత నైపథ్యంగా సాగుతుంది. తండ్రి దాన ధర్మాల వాల్ల ఆస్థిని కోల్పోయినా.. ఆయన నేర్పిన ధర్మ మార్గంలో జీవితాన్ని కొనసాగిస్తుంటాడు ధర్మారావు. అవసరమైన చోట తన జ్ఞాన సంపద పంచుతుంటాడు. ఈ క్రమంలో భగవంతుడికే అంకితమవ్వాలి అనుకున్న దేవదాసి ధ్యేయానికి సహకారం అందించి ఆమెకి మోక్షం కలిగించేలా చూస్తాడు. కథ పూర్తిగా తెలుసుకోవాలంటే నవల చదవాల్సిందే.
విశ్లేషణ:
ఈ నవలలో ఈ కాలానికి ఉపయోగపడే కొన్ని ముఖ్య సందేశాలు చెప్పబడ్డాయి. ధర్మాన్ని మనం కాపాడితే అదే మనల్ని రక్షిస్తుందని ఈ నవల ద్వారా రచయిత చక్కగా వివరించారు. సంకల్పం ఎంత గొప్పగా ఉంటే విజయం అంతే ఉన్నతంగా వరిస్తుందని గిరిక పాత్ర ద్వారా చెప్పకనే చెప్పాడు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా శిక్ష తప్పదని మంగమ్మ పాత్ర తెలియజేస్తుంది. ఈ నవలను చదివి అందులోని సారాంశాన్ని అర్థం చేసుకోగలిగితే మీ జీవితంలో ఉన్నతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Buy Now
6.నవల : పాకుడు రాళ్లు
రచయిత : రావూరి భరద్వాజ
కథేంటి?
మంగమ్మ ఒక రంగస్థల నటి. నాటకాలలో బాగా పేరు తెచ్చుకున్న మంగమ్మను చలపతి తను తీస్తున్న సినిమాలో కథానాయకి పాత్ర ఇస్తానని మద్రాసు తీసుకువస్తాడు. సినిమాలలో చాన్సుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసి మంగమ్మ పెద్ద కథానాయక అవుతుంది. మంగమ్మ కాస్తా మంజరిగా మారి తెలుగు సినీ లోకాన్ని రంజింపజేస్తుంది. ఎడా,పెడా సినిమాలతో బాగా డబ్బు సంపాదిస్తూ అదే సమయములో సినీ ప్రపంచంలో తన స్థానం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో మంజరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆమె వాటి నుంచి ఎలా బయటపడింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సినీ జగత్తులోని చీకటి తెరలను బహిర్గతం చేస్తూ తన శైలిలో రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడు రాళ్ళు నవలను రాశారు. ఈర్ష్య, అసూయ, ఆర్భాటం, డబ్బు, దర్పం, అధర్మం, అనైతిక విలువలతో కూడిన చిత్ర పరిశ్రమలోని రాజకీయాలను ఈ నవలలో చూపించారు. వారిని ఒక స్త్రీ ఎలా ఎదిరిగించి నిలబడగల్గిందో ఈ నవలలో చక్కగా వివరించారు రచయిత. సినీ ఇండస్ట్రీలోని ఒకానొక వర్గంపై ఎక్కుపెట్టిన అస్త్రంగా ఈ నవలను చెప్పుకోవచ్చు.
Buy Now
7. నవల : ఎన్.జి.ఓ
రచయిత: ఆచార్య ఆత్రేయ
కథేంటి?:
కథానాయకుడైన రంగనాథం ఒక గుమస్తా. మధ్యతరగతి జీవి. పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడుతుంటాడు. లేని పోని భేషజాలకు పోయి అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటాడు. ఇక గోపి రంగనాథం తమ్ముడు. విప్లవ భావాలు కలిగినవాడు. చిన్న వయసులోనే జీవితం పట్ల విరక్తి కలిగినవాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?. వాటిని రంగననాథం ఎలా ఎదుర్కొన్నాడు? అనేది నవల చదివితే తెలుస్తుంది.
8. నవల : అసమర్దుని జీవయాత్ర
రచయిత : త్రిపురనేని గోపిచంద్
కథేంటి?:
నవలా కథానాయకుడు సీతారామరావు. అతను ఉన్నత కుటుంబానికి చెందిన వాడు. తన తండ్రి అంత్యక్రియలను గొప్పగా చేసి అప్పుల పాలవుతాడు. ఈ క్రమంలో సీతారామంకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?. చివరకి కథానాయకుడు ఎలాంటి స్థితికి చేరుకున్నాడు? అనేది మిగిలిన నవల వృత్తాంతం.
Buy Now
9. నవల : కన్యాశుల్కం
రచయిత : గురజాడ అప్పారావు
కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన సాంఘిక నాటకం. అది మొదటిసారి 1897 లో ప్రచురించబడింది. అప్పట్లో విజయనగరం ప్రాంతంలో కన్యాశుల్కం ఆచారం బాగా ఉండేది. విజయనగర రాజావారు చేసిన సర్వే వల్ల ఏటా దాదాపు 344 బాల్యవివాహాలు జరిగేవని గురజాడ అప్పారావు తెలుసుకున్నారు. దానిపై తీవ్ర కలత చెందిన ఆయన ‘కన్యాశుల్కం’ అనే ఒక గొప్ప సాంఘిక నాటకాన్ని రచించాడు. ఇందులో తనదైన శైలిలో బాల్య వివాహలపై రచయిత ఎక్కు పెట్టాడు.
Buy Now
10. నవల : తులసిదళం
రచయిత : యండమూరి వీరేంద్రనాథ్
కథేంటి?:
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష పెంచుకున్న కొందరు వ్యక్తులు కుతంత్రంతో ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తిని ప్రయోగిస్తారు. దీనిలో కాద్రా అనే మాంత్రికుడి కీలకపాత్ర పోషిస్తాడు. ఆధునిక భావాలు కలిగిన తులసి తండ్రి జరిగింది చేతబడి అని ఎలా తెలుసుకుంటాడు? తులసిని కాపాడేందుకు ఎలాంటి మార్గాలను అన్వేషిస్తాడు? చివరకు కుమార్తెను కాపాడుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
తులసిదళం నవల 1980లో ఆంద్రభూమి వారపత్రికలో సీరియల్‌గా వచ్చింది. వైజ్ఞానిక విశ్లేషణను, తాంత్రిక విధానాలను సమాంతరంగా చూపడానికి రచయిత యండమూరి వీరేంద్రనాథ్ యత్నించారు. ఈ నవలకు పొడిగింపుగా యండమూరి వీరేంద్రనాథ్ ‘తులసి’, ‘కాష్మోరా’ అనే నవలలు వ్రాశాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!