Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    Telugu OTT Releases: ఈ వారం (మే 8) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    May 8, 2023

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 8-14వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, అనువాద చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:

    కస్టడీ

    నాగ చైతన్య (Naga Chaitanya) – కృతిశెట్టి (Krithi Shetty) జంటగా చేసిన కస్టడీ (Custody) చిత్రం ఈ వారమే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 12 (శుక్రవారం)న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇందులో చైతూ శివ అనే నిజాయతీ గల పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకథకు ప్రాధాన్యమున్నట్లు ప్రచార చిత్రాన్ని తీర్చి దిద్దిన తీరును బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించగా.. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన కస్టడీ పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

    ఛత్రపతి (హిందీ)

    ఛత్రపతి (Chatrapathi) సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మే 12 (శుక్రవారం)న రిలీజ్‌ కానుంది. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాకు ఇది రీమేక్‌.  భాగ్యశ్రీ, శరద్‌ కేల్కర్‌, శివం పాటిల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయంతిలాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.  

    భువన విజయమ్‌ 

    సునీల్ ప్రధాన పాత్రలో చేసిన భువన విజయమ్(Bhuvana Vijayam) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. మే 12 (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భువన విజయమ్‌తో  యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఈ సినిమా 30 ఇయర్స్‌ పృథ్వీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ తదితర హాస్యనటులు నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. 

    ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌

    ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’ (The Story Beautiful Girl) సినిమా కూడా ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఇందులో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి రవి ప్రకాష్ బోడపాటి దర్శకత్వం వహించగా ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్‌ తో పాటు, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.

    కళ్యాణమస్తు

    శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’ (Kalyana Masthu). ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహించారు. బోయపాటి రఘుబాబు నిర్మాత. మే 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమతో మొదలైన ఓ జంట ప్రయాణం… పెళ్లి వరకూ ఎలా సాగిందనేది అసలు కథ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

    మ్యూజిక్‌ స్కూల్‌ 

    శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటించిన మ్యూజిక్‌ స్కూల్‌ (Music School) చిత్రం మే 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రానికి బియ్యాల పాపారావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.

    ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌

    న్యూసెన్స్‌

    నవదీప్‌ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’. శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

    దహాద్‌

    బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ప్రధాన పాత్రలో చేసిన ‘దహాద్‌’ (Dahaad) వెబ్‌సిరీస్‌ కూడా ఈ శుక్రవారమే స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ సిరీస్‌ వీక్షించవచ్చు. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించనుంది. పబ్లిక్‌ బాత్‌రూమ్‌లలో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరు మహిళల హత్య కేసును ఛేదించడానికి అంజలి భాటి చేసిన ప్రయత్నాలు, కథలో ఊహించని మలుపులను ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు.

    ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు… 

    TitleCategoryLanguagePlatformRelease Date
    The Muppets Mayhemseries EnglishDisney+ HotstarMay 10
    Soppana SundariMovieTamilDisney+ HotstarMay 12
    AirMovieenglishAmazon PrimeMay 12
    Justice LeagueSeriesEnglishNetflixMay 08
    Spirit Rangers, season 2SeriesEnglishNetflixMay 08
    Documentary Now!, season 4SeriesEnglishNetflixMay 09
    Black Knight SeriesEnglishNetflixMay 12
    Faithfully Yours MovieEnglishNetflixMay 17
    Yakitori: Soldiers of MisfortuneSeriesEnglishNetflixMay 18

    SeriesHindiZee5May 12
    Triangle of SadnessMovieEnglishSonyLIVMay 12
    Vikram vedaMovieHindiJio CinemaMay 12
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version